పొట్ట తగ్గాలంటే  ఏం చేయాలి ?,  ఏకైక మార్గం ఇదే

పొట్ట తగ్గాలంటే  ఏం చేయాలి ? ఈ ప్రశ్నకు సమాధానం ఇప్పుడు అందరికీ అవసరం అయిపోయింది.  పొట్ట అన్నది ప్రస్తుత కాలంలో పెరుగుతున్న అతి పెద్ద సమస్య. ప్రముఖ డాక్టర్స్ చెప్పే మాట.. సమస్త రోగాలకు పొట్ట పునాది లాంటది అని. ఎందరో ఎన్నో సలహాలు ఇస్తారు. కానీ పొట్ట మాత్రం తగ్గదు. నేటి భారతీయ సమాజంలో పొట్ట సమస్య చాలా ఎక్కువ అవుతోంది. ఆధునిక జీవన శైలికి అలవాటు పడిన వారిలో ఈ పొట్ట సమస్య మరీ ఎక్కువగా కనిపిస్తోంది. ఏం చేసినా.. తిండి మానేసినా.. ఆసనాలు వేసినా పొట్ట తగ్గడం లేదు అంటుంటారు. కానీ, ఈ ఆర్టికల్ చదివాక, పొట్ట తగ్గాలంటే  ఏం చేయాలి ? అనేది మీకే అర్థమవుతుంది.

ఐతే, ముందు  పొట్ట తగ్గడానికి చిట్కాలు తెలుసుకునే ముందు.. ఆ సమస్య ఎక్కడ మొదలైంది ? అని తెలుసుకోండి. పొట్ట అంటే శరీరంలో కొవ్వు పెరిపోయి, ఆరోగ్య పరమైన సమస్యలు తలెత్తడానికి పునాది వేస్తోంది. అంతిమంగా పొట్ట వల్ల మనిషి జీవితకాలం కూడా తగ్గుతుంది. మొదట్లో కాస్త బొద్దుగా ఉన్నావంటూ మిమ్మల్ని ముద్దు చేసినా, తర్వాత కాలంలో ఇది మీకు చాలా ప్రమాదకరంగా మారుతుంది. శరీరం బొద్దుగా ఉన్నట్లు కనిపించినా సమస్య మాత్రం ముదురుగానే ఉంటుంది.

 

అసలు పొట్టకి కారణం ఏమిటి ?

 

పొట్టకి ఒక్క కారణం అంటూ ఎప్పుడూ ఉండదు. చాలా కారణాలు ఉంటాయి. అన్ని కారణాలు ఒకదానికి మరొకటి కనెక్ట్ అయ్యి ఉంటాయి. సహజంగా పైకి కనిపించే కొన్ని కారణాల విషయానికి వస్తే.. మీరు ఎక్కువగా ఆహారం తీసుకోవడం, ముఖ్యంగా కొవ్వు పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం వంటివి ప్రధాన కారణంగా చెబుతారు. దీంతో పాటు శారీరక శ్రమ తక్కువగా ఉన్నవారు, కుర్చీ కు అతుక్కొని పనిచేసే వారిలో ఈ సమస్య అధికంగా కనిపిస్తోంది. వీరితో పాటు జన్మబపరమైన సమస్యలు ఉన్నవారు, సరిపడా నిద్ర లేని వారు, విచ్చలవిడిగా మందులు వాడేవారు, అలాగే.. ఆలస్యంగా గర్భం దాల్చిన వారు కూడా పొట్ట బారిన పడే ఛాన్స్ ఉంది.

 

పొట్ట తగ్గాలంటే  ఏం చేయాలి ? అనేదాని కంటే  అసలు పొట్ట రాకముందే గుర్తించడం ఎలా ?

 

పొట్ట రాకముందే గుర్తించడం చాలా సులభం అనిపిస్తోంది కదా. కానీ ఇది మీకు కనిపించదు. చెట్టు చిన్నగా ఉన్నంత మాత్రాన దాని వేర్లు కూడా చిన్నగా ఉంటాయని పొరపాటు పడొద్దు. కొన్ని చెట్లు ఎత్తు ఎక్కువగా పెరగవు, కానీ ఆ చెట్లు వేర్లు మాత్రం చాలా పెద్దవిగా ఉంటాయి. పొట్ట కూడా అలాంటి చెట్టు లాంటిది. పైకి వచ్చే ముందే.. లోపల పెరిగిపోయి ఉంటుంది. ఐతే, పొట్ట గుర్తించేందుకు ఒక ప్రాతిపదిక ఉంది. శరీరం బరువును కిలోల్లో లెక్కించాలి. దాన్ని ఎత్తును మీటర్లలో కొలిచి దాన్ని స్క్వేర్ చేసి ఈ ఫలితాన్ని బరువు తో భాగిస్తే వచ్చే అంతిమ ఫలితాన్ని బాడీ మాస్ ఇండెక్స్ చెబుతారు. ఈ బాడీ మాస్ ఇండెక్స్ 18 నుంచి 25 దాకా ఉంటే సాధారణ బరువుగా చెబుతారు. ఇది 25 నుంచి 30 దాకా ఉంటే అతి బరువుగా చెబుతారు. ఇది కొంత వరకు ఫర్వాలేదు. అయినప్పటికీ తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది. 30 నుంచి 35 దాకా ఉంటే స్థూలకాయం క్లాసు 1 గా, 35 నుంచి 40 దాకా ఉంటే క్లాసు-2 గా, 40 కి మించి ఉంటే క్లాసు-3 గా చెబుతారు. అంటే అత్యంత స్థూలకాయం అనుకోవచ్చు. స్థూలకాయం లావు మాత్రమే కాదు, పొట్టమయం కూడా.

 

పొట్ట వల్ల వచ్చే ప్రధాన సమస్యలు

 

పొట్ట వల్ల ఎన్నో సమస్యలు వస్తాయి. పైకి కనిపించేవి మాత్రం కొన్ని ఉన్నాయి. పొట్టతో ఎక్కవ కదల్లేక పోవడం, ఓపిక లేకపోవడం, ఇతరులపై ఎక్కువ ఆధారపడటం వంటి సమస్యలు పైకి కనిపిస్తాయి. అలాగే, హైపర్ టెన్షన్, కొలెస్టిరాల్, టైప్-2 మధుమేహం, గ్యాస్టిక్ బ్యాండింగ్ ఇలా చాలా సమస్యలు చాలా త్వరగా వస్తాయి.

 

మరి,  పొట్ట తగ్గాలంటే  ఏం చేయాలి ?

 

  • చాలామంది పొట్ట సమస్యకు తిండి తగ్గించుకోవడం మంచిది అని సూచిస్తుంటారు. ఇందులో మీరు అర్ధం చేసుకోవాల్సింది. కేవలం కొవ్వు సంబంధిత పదార్థాలు, అలాగే, నిల్వ పదార్థాల్ని (బేకరీ ఫుడ్స్) తినడం తగ్గించుకోమని అర్ధం. జంక్ ఫుడ్ ను పూర్తిగా పక్కన పెట్టండి.

 

  • పొట్ట తగ్గడానికి బెస్ట్ టిప్ ఏదైనా ఉందా అంటే.. ప్రతీ రోజు శారీరక వ్యాయామం చేయడం మాత్రమే. అన్నట్టు మీ బాడీ మాస్ ఇండెక్స్ టాప్ 30-35 దాకా ఉంటే కచ్చితంగా మీరు జాగ్రత్తలు తీసుకోవాల్సిందే.

 

  • స్లీవ్ గ్యాస్ట్రిక్ టమీ అనే చికిత్స కూడా అందుబాటులో ఉంది. శరీరంలో జీర్ణాశయ భాగంలో సర్జరీ ద్వారా 10 నుంచి 15 శాతం తొలగించటాన్ని స్లీవ్ గ్యాస్ట్రెక్టమీ గా చెబుతారు. అంటే మీ జీర్ణాశయానికి కోత పెట్టి, కొంత భాగాన్ని తొలగించాక, మళ్లీ కుట్టడం ద్వారా సాధారణ స్థితికి తీసుకొని వస్తారు. దీని ఫలితంగా కొంత వరకు పొట్ట ఆకారంలో చాలా మార్పు వస్తుంది. లాప్రోస్కోపిక్ విధానంలో మాత్రమే దీన్ని నిర్వహించేందుకు వీలవుతుంది. గమనిక : ఈ చికిత్స అందరికి చేయరు. చేయకూడదు కూడా. మరి భారీగా పొట్ట ఉండి, చాలా దారుణంగా ఇబ్బంది పడుతున్న వారికి మాత్రమే ఈ చికిత్స చేస్తారు.

 

  • అన్నట్టు ఓ మాదిరి పొట్ట ఉన్న వారికి చాలా ఈజీగా పొట్ట తగ్గాలంటే.. వారు కొన్ని ఆసనాలు వేయాల్సి ఉంటుంది. ఆ ఆసనాల్లో కూడా బెస్ట్ ఆసనం, డాక్టర్స్ తో పాటు యోగా గురువులు కూడా తరుచూ సూచించే ఆసనం ఒకటి ఉంది. అదే ఉత్కటాసనం.

 

పొట్ట తగ్గాలంటే  ఏం చేయాలి ? ఇదే  బెస్ట్ ఆసనం ఇదే

 

ఉత్కటాసనం చాలా పవర్ ఫుల్ ఆసనం ఉంది. ఈ ఉత్కటాసనాన్ని కుర్చీ భంగిమ అని కూడా పిలుస్తారు. ఈ ఆసనం కాళ్లలోని కండరాలను, ముఖ్యంగా తుంటి భాగాన్ని, అలాగే తొడల భాగాల పై ఒత్తిడిని చాలా ఎక్కువగా పెంచుతుంది. మీరు కుర్చీపై అలా కూర్చోన్నట్లు ఫోజులో ఉంటారు కాబట్టి,  మీ శరీరంపై అధిక ఒత్తిడి పెరిగి.. మీ తొడలు, మీ బెల్లీ భాగంలో కొవ్వు చాలా వేగంగా కరిగిపోతుంది. పొట్ట తగ్గాలంటే  ఏం చేయాలి ? అనే ప్రశ్నకు సింగిల్ ఆన్సర్  ఈ ఉత్కటాసనం.

 

బ్యాక్ పెయిన్ బెస్ట్ టిప్స్ తెలుగులో Telugu Needs
బ్యాక్ పెయిన్

ఉత్కటాసనం ఎలా వేయాలి ?

 

  • ఉత్కటాసనంలో ముందుగా  మీ  రెండు పాదాలను దగ్గరగా పెట్టుకోవాలి. అన్నట్టు మీరు నిలబడి ఉండాలి.

 

  • ఆ తర్వాత మీరు రెండు నిమిషాల పాటు  మీ పొట్ట నిండా శ్వాస పీల్చుతూ రిలాక్స్ అవ్వాలి. ఇది చేసే సమయంలో నా పొట్ట వేగంగా కరుగుతుంది అని మీ మనసులోనే  మీరు బలంగా అనుకోండి.

 

  • ఆ తర్వాత రెండు కాళ్లను మోకాళ్ల దగ్గర మడిచి నెమ్మదిగా  మీ శరీరాన్ని కిందకు తీసుకొస్తూ  కుర్చీ లెవల్లో ఆ ఫోజు పెట్టి అలాగే ఉండాల్సి ఉంటుంది.

 

  • అనంతరం మీ రెండు చేతులను నేలవైపు చూపించాలి, అలా చేశాక, మీ మధ్య వేళ్లతో నేలను తాకాల్సి ఉంటుంది.  డౌట్ ఉంటే పై బొమ్మ చూడగలరు.

ఇక ఆ తర్వాత  మీ రెండు చేతులను పూర్తిగా ఆకాశంవైపు లేపుతూ అరచేతులను నమస్కారం చేస్తున్నట్లు ఫోజు ఇవ్వండి.  గుర్తు పెట్టుకోండి, ఈ భంగిమలో మీ రెండు చేతులను బలంగా పైకి లాగాలి. అప్పుడే మీ వెన్నుపూస నిటారుగా ఉంటుంది. అదే విధంగా మీ  తొడలు కుర్చీ ఆకారంలో సమాన స్థితిలో ఉండేలా జాగ్రత్త పడండి. ఇలా మీకు సాధ్యమైనంత సేపు చేసి.. ఆ తర్వాత రిలాక్స్ అవ్వండి. ఇలా  చేసే సమయంలో నా పొట్ట వేగంగా కరుగుతుంది అని మీ మనసులోనే  మీరు బలంగా అనుకోండి. కచ్చితంగా మీ పొట్ట తగ్గుతుంది.

Leave a Comment