ఒక దేశ కరెన్సీకి విలువను ఎలా నిర్ణయిస్తారు ?  

గొప్ప ఆర్థికవేత్తలు చెప్పిన  విలువైన ఆర్థిక సూత్రాలను  మీకు అర్ధమయ్యేలా అందించడానికి  మా  తెలుగునీడ్స్.కామ్  ఈ  డబ్బు సీరీస్ ఆర్టికల్స్ ను  రాస్తూ వస్తోంది. ఇందులో భాగంగా ఈ రోజు మరో కథనం మీ కోసం. మనలో చాలా మంది  “నేను డబ్బుకు అంత ప్రాముఖ్యం ఇవ్వను” అంటుంటారు. ఎవరో ఒకరు నుంచి తరుచూ వినిపించే మాటే ఇది. నిజానికి ఆ మాట అనేవారు అందరూ ఆడుతున్న అతి పెద్ద అబద్ధం ఏదైనా ఉందా అంటే అదే. నేడున్న మీ స్థానం, భవిష్యత్తులో మీరు ఉండబోయే స్థానం వగైరాలన్నీ మీ దగ్గరున్న డబ్బుతోనే ముడి పడున్నాయి. కాబట్టి నా జీవితంలో డబ్బుకు ప్రాముఖ్యత లేదనే వారు తమని తాము మోసం చేసుకుంటున్నట్టే.

మీ స్థాయి నుంచి మీ ఆస్తి, మీ ఆత్మస్థైర్యం… అలాగే సమాజంలో మీ స్థానం వరకూ అంతా మీరు సంపాదించిన డబ్బుతోనే ముడి పడి ఉంటాయి. ప్రతి ఒక్కరి జీవితంలోని ప్రతి దశలో డబ్బు అవసరం అవుతుంది. డబ్బు అందుబాటులో లేకపోతే జీవితమే నిలిచిపోవచ్చు. అందుకే, మనిషి బతకడానికి శరీరంలో ప్రవహించే రక్తం ఎంత కీలకమో…  డబ్బు కూడా అంతే కీలకం. చాలామంది ఎప్పుడూ ఓ మాట చెబుతారు. పుట్టుకనుండి కాటి వరకు డబ్బు అవసరం ఉంటుంది. కానీ ఈ రోజుల్లో అంత్యక్రియలు ఎవరూ ఉచితంగా చేయరు కదా. అందుకే మీకు డబ్బు పై ఇష్టం కాదు, గౌరవం పెరగాలి. మీకు డబ్బు కావాలనే అనుకుంటే ఆ డబ్బుకున్న విలువ ఏమిటో స్పష్టంగా అర్థం చేసుకోండి. విలువ అర్ధమైతే.. సంపాదించుకుంటారు.

డబ్బుకు సంబంధించి పలు ఇంట్రెస్టింగ్ విషయాలు

డబ్బు ఎన్ని రకాలు ?

ఆర్థికవేత్తలు డబ్బును 4 రకాలుగా డివైడ్ చేశారు. డబ్బులో 4 ప్రధాన రకాలు ఉన్నాయి:  కమోడిటీ మనీ,  ఫియట్ మనీ, ఫిడ్యూషియరీ మనీ, కమర్షియల్ బ్యాంక్ మనీ. కమోడిటీ మనీ అంటే  వస్తు మార్పిడి విధానంలో ఉపయోగించే డబ్బు.

ఉదాహరణకు : గోల్డ్, మరియు బంగారు నాణేలు, విలువైన పూసలు, ముత్యాలు, విలువైన రంగు రాళ్లు లాంటివి.

ఫియట్ మనీ అంటే.. మనం రెగ్యులర్ గా వాడే డబ్బు.  ఇది ప్రభుత్వ ఉత్తర్వుల ద్వారా నిర్ణయించబడుతుంది.

ఉదాహరణకు : నోట్లు నాణేలు లాంటివి.

ఫిడ్యూషియరీ మనీ అంటే.. ఏదైనా బ్యాంక్ కి కస్టమర్ లు తీసుకున్న డబ్బును చెల్లించలేని పరిస్థితుల్లో   వారి వస్తువులను, ఆస్తులను విక్రయించే ప్రాసెస్ ను లేదా వేరొకరికి బదిలీ చేయగలిగే ప్రాసెస్ ను ఫిడ్యూషియరీ మనీ అంటారు. ఇక, కమర్షియల్ బ్యాంక్ మనీ అంటే.. చెక్కు లేదా నగదు రూపంలో ఉండేవి.      


అసలు,  ఒక దేశ కరెన్సీకి విలువను ఎలా నిర్ణయిస్తారు?

ఏ దేశానికైనా ఆ దేశ డబ్బు విలువ అనేది మొత్తం ఆ దేశం సరఫరా మరియు డిమాండ్ అలాగే,.. రాజకీయ స్థిరత్వం మరియు మొత్తం ఆర్థిక పనితీరుతో సహా వివిధ అంశాల ద్వారా నిర్ణయిస్తారు. అదేవిధంగా దేశ ద్రవ్యోల్బణం మరియు ద్రవ్య సరఫరాతో సహా ఇతర అంశాలు కూడా ఓ దేశ కరెన్సీ విలువను డిసైడ్ చేస్తోంది. సింపుల్ గా చెప్పుకుంటే.. ఓ దేశ కరెన్సీ విలువ అనేది ఆ దేశ ఆర్థిక, రాజకీయ మరియు ఆ దేశ మార్కెట్ శక్తుల ప్రభావం కూడా ఎంతో ఉంటుంది.

Leave a Comment