దేవర మూవీలో మెయిన్ హైలెట్స్ ఇవే   

దేవర మూవీ రివ్యూ ఏంటి ?, ఇంకా సినిమానే రిలీజ్ కాలేదు కదా అనుకుంటున్నారా ?,  దేవర పార్ట్ 1  స్క్రిప్ట్ రివ్యూ ఇది.  జూనియర్ ఎన్టీఆర్… నటన పరంగా ఇన్ని దశాబ్దాల్లో సౌత్ ఇండియన్ హీరోలు ఎవరికీ సాధ్యం కాని నేషనల్ పాపులారిటీని సాధించిన గొప్ప నటుడు. ప్రస్తుతం తారక్ ది ఎక్సలెంట్ కెరీర్… ఆర్ఆర్ఆర్ తర్వాత తాను నార్త్ లో కూడా అంత బలంగా కనెక్ట్ అయ్యాడు మరి. పైగా దేవర, వార్ 2 లాంటి  ప్రెస్టీజియస్ ప్రాజెక్టులు తన చేతిలో ఉన్నయ్… ఐతే, ఇప్పుడు దేవర స్క్రిప్ట్ గురించి చాలా ముచ్చట్లు వినిపిస్తున్నాయి. ఫస్ట్ షాట్ నుంచి చివరి షాట్ దాకా ఎన్టీఆర్ విశ్వరూపం చూస్తారట. అంటే దేవర పాత్ర ఏమీ నటనకు ఛాలెంజింగ్ రోల్ కాదు, కానీ అలా ప్రేక్షకులను థియేటర్లో కూర్చున్నంత సేపూ నటనతో ఆకట్టుకోవడం  అనేది పెద్ద టాస్కే… దాన్ని ఎన్టీఆర్ పర్‌ఫెక్ట్‌గా పోషించాడని… ఇప్పటికే పూర్తి అయిన దేవర ఫస్ట్ పార్ట్ రఫ్ వెర్షన్ చూశాకా, కొరటాల టీమ్ చెబుతున్న మాట ఇది.  ఎన్టీఆర్  – జాన్వీ కపూర్ ల నడుమ సీన్లు, కెమిస్ట్రీ కూడా బాగా వర్కవుట్ అయ్యాయట. 

కానీ, దేవర సినిమా విడుదలయ్యాక, దేవర మూవీ రివ్యూలలో ఎన్టీఆర్ గురించి కాదు, ఎన్టీఆర్ పాత్ర గురించే మాట్లాడుకుంటారు అంటున్నాడు కొరటాల.  జాన్వీ కపూర్ పాత్ర బాగా హైలైట్ అవుతుంది అంటూ  ఆ మధ్య  ఓ ప్రెస్‌ మీట్‌ లో టీమ్ చెప్పింది.  కానీ, జాన్వీకి అంత సీనేమీ లేదు… జాన్వీ కపూర్  పెద్ద ప్లస్ పాయింటేమీ కాదు సినిమాలో… అసలు ఎవరూ కనిపించరు సినిమాలో ఎన్టీఆర్  తప్ప… గ్లామర్‌కూ బోల్డ్‌కూ నడుమ గీతలు చెరిపేసినా సరే జాన్వీ కపూర్ పెద్దగా ప్రభావం చూపలేక పోయిందట. 

 

దేవర మూవీ రివ్యూలో  మెయిన్ ప్లస్ పాయింట్ :

దేవర పార్ట్ 1 సినిమాలో మరీ మరీ చెప్పుకోవాల్సింది వన్ లైనర్లు… డైలాగులు రాయడానికి  కొరటాల ఎంత మథనం చేశారో గానీ… దాదాపు ప్రతి సీన్‌లో డైలాగ్ లు చాలా బలంగా ఉన్నాయట. ఒక యాక్షన్  ఓరియెంటెడ్ సినిమాకు అంతకుమించి ఏం కావాలి..? ఈమధ్యకాలంలో ఇంతగా పేలే వన్ లైనర్స్‌ను మరో స్టార్ హీరో సినిమాలో చూడలేం అంటున్నారు. మొత్తానికి దేవర ఫస్ట్ పార్టు సక్సెస్‌ అయితే, అందుకు ముఖ్య కారణాల్లో ఎన్టీఆర్ పలికే డైలాగ్ లు కూడా ప్రధాన కారణం అవుతాయట.  దేవర సినిమాలో ఎన్టీఆర్ యాక్షన్  మైండ్ బ్లోయింగ్ అట. ముఖ్యంగా ఎన్టీఆర్ పెర్ఫార్మెన్స్ టాక్ ఆఫ్ ది టౌన్ అవుతుంది అంటున్నారు.

దేవర పార్ట్ 1 మొదలైన మొదటి నిమిషం నుంచి  ఎన్టీఆర్ అభిమానులు విజిల్స్ తో కేకలతో ఊగిపోయేలా ఉంటుందట. ప్రతి పది సీన్స్ కి  ఒక భారీ ఎలివేషన్ సీన్ ఉంటుందని.. సైఫ్ అలీఖాన్ తో సహా విలన్ బ్యాచ్ గాల్లో తేలుతూ ఉంటారని.. వీటి మధ్య సముద్ర నేపథ్యంలోని భూములకు సంబంధించి మంచి మెసేజ్ ఇచ్చారని తెలుస్తోంది. దేవర కథలో కథనంలో కంటెంట్ తో పాటు మంచి ఫీల్ కూడా ఉందట.  దేవర పార్ట్ 1 సినిమా  పాన్ ఇండియా సినిమా కావడంతో  ఎన్టీఆర్  ఫ్యాన్స్ తో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులను ఈ సినిమా ఆకట్టుకోబోతుంది. సినిమా రిలీజ్ అయ్యాక వచ్చే  దేవర మూవీ రివ్యూ లో కూడా ఇవే పాయింట్స్ ను చెబుతారు చూడండి.

ఎన్టీఆర్ పై  ఆ ప్రచారం ఎందుకు ?

ఇదిలా ఉంటే.. ఎన్టీఆర్ పై మాత్రం బాగా నెగిటివ్ ప్రచారం జరుగుతుంది. రాజకీయాలకు ముడిపెట్టి తన పేరును వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు కొందరు. ఏది ఏమైనా ఎన్టీఆర్ గుడ్ హ్యూమన్ బీయింగ్… చిల్లర మాటలుండవ్, మనుషులను ప్రేమిస్తాడు… అన్నిటికి మించి తను సొంతంగా నిర్మించుకున్న ట్రెమండస్ కెరీర్ ఉంది… ఎన్టీఆర్ ను పిచ్చిగా ఆరాధించే ఫ్యాన్‌జనం ఉన్నారు… తన పై ఎవరు ఏమన్నా  ఎన్టీఆర్ మాత్రం  ఒక్క మాట కూడా ఎక్కడా తూలడు… అంతెందుకు ప్రమోషన్ మీట్లలో కూడా  తారక్  చాలా చాలా సంక్షిప్తంగా, స్ట్రెయిట్‌గా ముగించేస్తాడు. మరి అలాంటి ఎన్టీఆర్ ఎంతో కష్టపడి చేస్తున్న దేవర హిట్ అవ్వాలని ఆశిద్దాం.       

 

దేవర గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు  :

దేవర మూవీ రివ్యూ కంటే ముందు..  అసలు సినిమా కోసం ఎన్టీఆర్ ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నాడు ?   

దేవర పార్ట్ 1 కోసం ఎన్టీఆర్ దాదాపు 80 కోట్ల రూపాయలు అందుకున్నట్లు తెలుస్తోంది. దేవర పార్ట్ 2 కి రెమ్యునరేషన్ తీసుకోకుండా లాభాల్లో 40 % షేర్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.  

ఇంతకీ, దేవర సినిమా బడ్జెట్ ఎంత ?

ముందుగా  దేవర: పార్ట్ 1 బడ్జెట్ విషయానికి వస్తే.. రూ.180 కోట్లు ఉంటుందట. అలాగే,  దేవర: పార్ట్ 1 బడ్జెట్ రూ.120 కోట్లు ఉండొచ్చు అని తెలుస్తోంది. దేవర రెండు పార్ట్ లు కలిపి చూసుకుంటే.. కొరటాల శివ ఈ సినిమాకి దాదాపు రూ.300 కోట్ల రూపాయలను ఖర్చు పెట్టిస్తున్నాడు. మరి ఇంత భారీ బడ్జెట్‌తో రూపొందుతోంది కాబట్టి, దేవర అవుట్ ఫుట్ చాలా బాగుంటుంది.    

దేవర పార్ట్ 1  సినిమా రిలీజ్ డేట్  ఎప్పుడంటే ? 

దేవర: పార్ట్ 1 సినిమా రిలీజ్ డేట్ ను మేకర్స్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. దసరా సందర్భంగా అక్టోబర్ 10వ తేదీన తెలుగు, హిందీ, తమిళం, మలయాళం మరియు కన్నడ భాషల్లో దేవర పార్ట్ 1 గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. నిజానికి దేవర చిత్రం ఈ ఏడాది ఏప్రిల్ 5న విడుదల కావాల్సి ఉంది. కానీ,  అక్టోబర్ 10వ తేదీకి వాయిదా పడింది.

Leave a Comment