డబ్బు సంపాదించడం ఎలా ?, ఇది గొప్ప సూత్రం

డబ్బు సంపాదించడం ఎలా ? అనే టాపిక్ పై  ఎందరో మహోన్నతమైన ఆర్థికవేత్తలు చెప్పిన  గొప్ప ఆర్ధిక సూత్రాలను  మీకు అర్ధమయ్యేలా అందించడానికి  మా  ‘తెలుగునీడ్స్.కామ్’ ఈ  డబ్బు సీరీస్ ఆర్టికల్స్ ను  రాస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా ఈ రోజు సరికొత్త కథనం.  మనలో చాలామంది వ్యక్తులు   తాము సంపాదించిన డబ్బును ఏం చేస్తారో తెలుసా ?,  తమకు ఇష్టం లేని వస్తువులు కొనడానికి.. నచ్చని వ్యక్తులను ఆకట్టుకోవడానికి ఖర్చు చేస్తారట. ఈ మాట  గొప్ప ఆర్థికవేత్త  విల్ రోజర్స్ చెప్పాడు.  ఆయన మాటల్లో నిజం ఉందనిపిస్తోంది కదూ.  సరే  ఈ ఆర్టికల్ లో ముందు  డబ్బు స్వభావం గురించి అర్ధం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం.  

ప్రస్తుతం అత్యంత ఖరీదైన పెయింటింగ్స్ లో  కోట్లాది డాలర్లకు కొనుగోలు అవుతున్నవి ఎవరి పెయింటింగ్స్  ?, చెప్పగలరా ?,   చిత్రకారుడు విన్సెంట్ వాన్గ్ వి. కాబట్టి,  విన్సెంట్ ఎంతో గొప్ప జీవితాన్ని గడిపి ఉంటాడని అందరూ అనుకుంటారు. కానీ, ఆయన తన జీవితంలో ఎప్పుడూ పేదరికంలోనే ఉన్నాడని ఎంతమందికి తెలుసు.  విన్సెంట్ వాన్గ్ దగ్గర నిజంగా డబ్బు ఎప్పుడూ  లేదు.  ఆయన అతి కష్టం మీద తన జీవితం వెళ్లబుచ్చాడు. పైగా నిరుపేదగా మరణించాడు. ఇలా ఒక్క విన్సెంట్ వాన్గ్ మాత్రమే కాదు. ఆయనలా  ఎందరో ఉన్నారు.  వారంతా జీవితంలో ఎంతో కష్టపడతారు. కానీ,  డబ్బును సంపాదించలేరు. తన పెయింటింగ్స్ కి  అంతర్జాతీయ మార్కెట్ ను క్రియేట్ చేసిన వ్యక్తికి  డబ్బు సంపాదించడం రాదు అని ఎలా నమ్మగలం ?.   

ఇక్కడ కరెక్ట్ గా గమనిస్తే.. విన్సెంట్ వాన్గ్  కి కేవలం పెయింటింగ్స్ వేయడం మాత్రమే వచ్చు. కానీ, వాటిని మార్కెట్ చేసుకోవడం రాదు. సింపుల్ గా డబ్బు సంపాదించడం ఎలా ? అనేది తెలియదు.  మన రైతులను కూడా మరో ఉదాహరణగా తీసుకోవచ్చు. వారికీ పండించడమే వచ్చు. అమ్మడం రాదు. అందుకే, విన్సెంట్ వాన్గ్  లాంటి  ఎందరో గొప్ప టాలెంట్ ఉన్న వారు కూడా  దుర్భరంగా బతుకును వెళ్లదీశారు. ఇది  ఓ వర్గం అనుకుంటే..  మరి కొందరు ఉంటారు. రతన్ టాటా లాంటి వారు. లక్షలాది రూపాయలు ఎంతో కష్టపడి సంపాదించి  మొత్తం దానధర్మాలకు ఇస్తారు. వీరికి డబ్బును సంపాదించడమే కాదు, ఖర్చు పెట్టడం కూడా తెలుసు. ఏది ఏమైనా డబ్బు చాలా విచిత్రమైనది.  

 

కరెన్సీ కాగితాల లోకంలో   అన్నీ వింతలే :

వారెన్ బఫెట్ ఇలా అన్నాడు. మీకు ధనవంతులయ్యే రహస్యాన్ని చెబుతున్నాను.  బిజినెస్ లో ఇతరులు భయపడినప్పుడు మీరు అత్యాశతో ఉండండి. అదే, ఇతరులు అత్యాశతో ఉన్నప్పుడు  మీరు బిజినెస్ లో  భయపడండి. ఇదేంటి వారెన్ బఫెట్ ఇలా గజిబిజిగా ఏదో చెప్పాడు అనుకుంటున్నారా ?, డబ్బు నిజంగా గజిబిజీనే. ఒక్కోసారి డబ్బు చాలా ఆశ్చర్యపరుస్తోంది కూడా.  ఎంతో మర్యాదస్తులనుకున్నవారు నేరస్థులుగా మారిన కథలు  ఈ లోకంలో అనేకం ఉన్నాయి, కేవలం డబ్బు కోసం.  దొంగతనం, మోసం, చివరికి అయినవారిని  హత్య చేయడం వంటి దురాగతాలు చేసినవారు కూడా ఉన్నారు, కేవలం డబ్బు కోసం. ఈ డబ్బు కూడా ఎవరికీ అంత సామాన్యంగా అర్థం కాదు. కొందరిని ముంచుతుంది, మరికొందర్ని లేపుతుంది.          

తమ పెంపుడు కుక్కలను  బ్యూటీ సెలూన్లకు తీసుకువెళ్లి అలంకరణ చేయించే వారూ ఉన్నారు. ఆ కుక్కలకు  డిజైనర్ వస్తువులను కొనగలిగిన  వారూ ఉన్నారు  ఈ లోకంలో.  అదే  ఈ  లోకంలో వీధికుక్కల బతుకుకన్నా   అధ్వాన్నంగా బతుకుతున్న వారూ ఉన్నారు. పైగా అత్యధిక సంఖ్యలో.  ఒక్క రోజులో కోటి రూపాయలు పోగు చేసుకోగల్గినవారు కొందరుంటే,  రోజుకు వేయి కూడా సంపాదించలేనివారు కోట్లాదిమంది వున్నారు. సర్వసంపదలలో తేలియాడుతున్నప్పటికీ అభద్రతా భావానికి గురయ్యే వారు  చాలామంది వున్నారు.  మరోవైపు  చేతిలో డబ్బు లేనప్పటికీ  తామే మహారాజులమని బిల్డప్ ఇచ్చే వారూ ఉన్నారు. సుతిమెత్తని, ఖరీదైన పరువు మీద పడుకున్నా, కంటి మీద కునుకు రాదు కొంతమందికి. కానీ, కఠినమైన నేల మీద పడుకున్నా కొందరు ఒళ్లు తెలియకుండా నిద్రపోగలరు. ఈ ఉదాహరణలను బట్టి  ముందు అర్థం చేసుకోవాల్సింది  డబ్బుతో  ఈ ప్రపంచంలో అన్నీ సొంతం చేసుకోలేం అని.

 

డబ్బు గురించి ఈ ఇమేజ్ చెబుతుంది - Telugu Needs
డబ్బు

 

డబ్బు సంపాదించడం ఎలా ? :  మీ ఆలోచనలు  ఆ వైపే ఉండాలి  

ప్రతి అంశంలో ఎంతో వైవిధ్యం కనిపించే లోకంలో మనం బతుకుతున్నాం. మనం ఊహించుకునేవి, మన ఊహలకు అందనివి కూడా భూగోళం మీద ఏదో ఒక మూల నిలిచి వున్నాయి. వీటన్నిటి గురించి ఆలోచించి, బాధపడినా, మన చుట్టూ జరుగుతున్న సంఘటనలన్నింటినీ పట్టించుకున్నా, మన భావోద్రేకాలు భరించలేనివవుతాయి. ఈ కరెన్సీ లోకంలోని వింతలను, విశేషాలను మనం సక్రమంగా అర్థంచేసుకోలేం, మన ఊహలకు అవి సరిగ్గా అందవు. కాబట్టి మనం చేయగలిగిన ఉత్తమోత్తమ కార్యం, మన గురించి, మనకు సంబంధించిన అంశాల గురించి ఆలోచించటం. డబ్బు సంపాదించే విషయంలో ఇది అతి ముఖ్యమైన పాయింట్. మీరు గమనించండి. ఓ రంగంలో మాత్రమే బిజినెస్ చేస్తూ గొప్ప సక్సెస్ అయిన వ్యక్తికి మరో రంగం గురించి బేసిక్స్ కూడా తెలియవు. ఎంత నేర్చుకోవాలో కాదు, నేర్చుకుంది ఎక్కడ ఉపయోగించుకోవాలో తెలుసుకోవడమే డబ్బు సంపాదనలో మరో కీలకమైన పాయింట్.

ఇలాంటి కీలకమైన పాయింట్లను కూడా వదిలేసి అడ్రెస్ గల్లంతు అయిన వారు ఎందరో ఉన్నారు. నిరుపేద స్థితి నుండి కోటీశ్వరుల స్థాయికి ఎదిగిన గాథలు మన ముందు స్ఫూర్తిగా నిలిచినవి చాలా ఉన్నాయి. అదే సమయంలో కోటీశ్వరులు బికార్లుగా మారి సంభ్రమాశ్చర్యాలలో ముంచిన సంఘటనలున్నాయి. ఇదే డబ్బు మహిమ. మనం ఏ పని అయినా చేయాలి అంటే.. ముందు ఆ పని గురించి తెలుసుకోవాలి. అదేవిధంగా డబ్బు సంపాదించడం తెలుకోవాలంటే.. ముందు డబ్బు స్వభావం గురించి తెలుసుకోవాలి. పై చెప్పుకున్న విన్సెంట్ వాన్గ్, వారెన్ బఫెట్ ఉదాహరణలు డబ్బు స్వభావాన్ని బాగా చెబుతాయి.             

Leave a Comment