డబ్బులు ఎలా సంపాదించాలి ? ఏదీ బెస్ట్ ఫార్ములా అనే టాపిక్ పై ఎందరో మహోన్నతమైన ఆర్థికవేత్తలు చెప్పిన గొప్ప ఆర్ధిక సూత్రాలను మా తెలుగునీడ్స్.కామ్ మీకు వరుసగా అందిస్తోంది. ఈ రోజు మరో సరికొత్త కథనం. డబ్బు సంపాదన పై చాలా మందికి తమపై తమకు నమ్మకం ఉండదు. కానీ, కొందరు కష్టాలలో కూడా బాగా డబ్బు సంపాదిస్తారు. వారికి ప్రత్యేకమైన అవకాశాలు, పరిస్థితులు ఏమీ లేవు. మరెందుకు కొందరికి సాధ్యం అయింది, మరికొందరికి కాదు. ఇది మీకు బాగా అర్థం కావాలంటే ఓ కథ గురించి విందాం. అది 1938వ సంవత్సరం.. టోక్యో అనే నగరంలో ఒక కుర్రాడు స్వతంత్రంగా కార్ల పిస్టన్ రింగులు తయారు చేసి అబ్బుర పరిచాడు. చుట్టుపక్కల వారు ఆ కుర్రాడిని బాగా మెచ్చుకున్నారు.
దాంతో, ఆ కుర్రాడికి ఆత్మవిశ్వాసం పెరిగి, టయోటా కంపెనీ అపాయింట్మెంట్ తీసుకొని, తన పిస్టన్ రింగులు టయోటా కంపెనీ ఇంజనీర్లకు చూపెట్టాడు. వారు ఆ రింగులను మెచ్చుకుని, నీరు పిస్టన్ రింగులు కాంట్రాక్ట్ ఇవ్వాలంటే, కనీసం ఆటోమొబైల్ డిప్లొమా ఉండాలని షరతు పెట్టారు. పాపం ఆ కుర్రాడికి అది నచ్చలేదు. కారణం డబ్బులు ఎలా సంపాదించాలి ? అనేది తనకు తెలుసు అని ఆ కుర్రాడి నమ్మకం. కానీ, తన బంధువుల మాట విని ఆటోమొబైల్ డిప్లొమా చేసి, టయోటా కంపెనీకి పిస్టన్ రింగులు తయారు చేసే కాంట్రాక్ట్ సంపాదించాడు. ఆ కాంట్రాక్ట్ పేపర్స్ చూసి బ్యాంక్ కూడా అప్పు ఇచ్చింది. ఫలితంగా ఆ కుర్రాడు పిస్టన్ రింగులు తయారు చేసే చిన్న ఫ్యాక్టరీ పెట్టాడు. డెబ్భై శాతం ఫ్యాక్టరీ పనులు పూర్తి అయ్యాయి. ఆ టోక్యో నగరంలో అతను ఓ హీరో అయ్యాడు. అందరూ అతన్ని మెచ్చుకుంటూ అతనితో స్నేహం కోసం ఎదురుచూసే వారు.
డబ్బులు ఎలా సంపాదించాలి ? మొదటి దశ :
బిజినెస్ సక్సెస్ అయ్యే క్రమంలో ఇది మొదటిదశ. ఫ్యాక్టరీ పనులు పూర్తి అవుతున్నాయి కాబట్టి, తనకు ఇక తిరుగు లేదు అనుకున్నాడు ఆ కుర్రాడు. ఐతే, అంతలో రెండవ ప్రపంచ యుద్ధం టోక్యో నగరంలో కూడా మొదలైంది. ఓ యుద్ధపు బాంబు ఆ కుర్రాడి ఫ్యాక్టరీ మీద పడి, మొత్తం బూడిదయ్యింది. ఆ కుర్రాడికి మైండ్ పోయినట్టు అయ్యింది. డబ్బులు ఎలా సంపాదించాలి ? నీకు తెలుసు కదా అంటూ బంధువులు ఎగతాళి చేస్తూ దూరం జరిగారు. ఎలాగోలా తేరుకుని బ్యాంకుకు వెళ్ళి తన పరిస్థితి వెళ్ళడించి, ఆ కుర్రాడు మళ్ళీ అప్పు అడిగాడు. బ్యాంకు వారు ససేమిరా అన్నారు. చేసేది లేక, టయోటా కంపెనీ కాంట్రాక్టు కాగితం పట్టుకుని తన స్నేహితులను కలిసి వారికి ఆ కాగితం చూపెట్టి, చేబదులుగా అందరి దగ్గర డబ్బు అప్పు తీసుకుని, కూలిపోయిన ఫ్యాక్టరీని పున:ప్రారంభించాడు. ఈ సారి తొంబై శాతం ఫ్యాక్టరీ పూర్తయింది. మళ్ళీ ఆ కుర్రాడు హీరో అయ్యాడు. తనను హేళన చేసిన వారిని తిరిగి అవమానించాడు.
కానీ, టోక్యో నగరంలో భూకంపాలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. కాబట్టి, భూకంపాలు సర్వసాధారణమైన టోక్యో నగరంలో ఓ భూకంపం ఆ కుర్రవాడి ఫ్యాక్టరీని పూర్తిగా మట్టి కరిపించింది. దెబ్బకు మన హీరోకు పాతికేళ్ళకే ముసలితనం వచ్చేసింది. హీరో కాస్త మళ్లీ జీరో అయ్యాడు. దీంతో, స్నేహితులు వచ్చి డబ్బు అడిగారు. ఆ కుర్రాడు తనగోడును వెళ్ళగక్కి అప్పులను తప్పక తీరుస్తానని సర్ది చెప్పే ప్రయత్నం చేశాడు. వారు వినిపించుకోలేదు. కొందరు చేయి చేసుకున్నారు కూడా. ఇంతలో బ్యాంకు వారు ఎగబడ్డారు. ఉన్న ఆస్తిని పట్టుకుపోయారు. మరోవైపు కుర్రాడి ఫ్యాక్టరీని చూసి పిల్లని ఇస్తా అని చెప్పిన మామ కూడా ఛీ పొమ్మన్నాడు. పోనీ ఆ అమ్మాయి అయినా ఆదరిస్తోంది అనుకుంటే.. ఈ కుర్రాడి మొహం కూడా ఆమె చూడటానికి ఇష్టపడలేదు.
మరోవైపు ఆకలి బాధలు. గత్యంతరం లేక కూలీ పనులు చేసే వాడు. అందరూ ఆ కుర్రాడ్ని చూసి నవ్వుకోవడం మొదలు పెట్టారు. మొత్తానికి ఆ కుర్రాడు మరో ‘కేఏ పాల్’ లా తయారయ్యాడు. దీనికితోడు, ఖరీదైన ఆ టోక్యో నగరంలో డబ్బు లేకుండా బతకడం కష్టం అయిపోయింది. డబ్బులు ఎలా సంపాదించాలి ? తెలుసు అంటూనే సంపాదించలేక చతికిలపడ్డాడు. ఇక చేసేది ఏమీ లేక, దగ్గరలో నున్న ఓ గ్రామానికి ఆ ముసలి కుర్రవాడు తన మకాం మార్చాడు.
డబ్బులు ఎలా సంపాదించాలి ? రెండో దశ :
బిజినెస్ లో పూర్తిగా మునిగిపోయాక, రెండో దశ ఇది. ప్రస్తుతం ఆ కుర్రాడు రెండో దశలోనే ఉన్నాడు. ఆ గ్రామం నుండి పట్టణానికి సైకిల్ మీద వస్తూ, జీవితం మీద నమ్మకంతో, పట్టణంలో ఓ మెకానిక్ గ్యారేజ్ లో పనికి కుదిరాడు. ఇన్ని కష్టాలు తట్టుకుని నిలబడడం వలన ముప్పై ఏళ్లకే చాలా ముసలితనం అతనిలో నిండిపోయింది. దీనికితోడు తన గ్రామం నుంచి టోక్యో పట్టణానికి రోజూ సైకిల్ తొక్క వెళ్ళలేక విసిగిపోయాడు. అప్పుడే అతనికి ఓ ఐడియా వచ్చింది. తన ఆటోమొబైల్ పరిజ్ఞానంతో సైకిల్ కి ఓ మోటారు బిగించాలని నిర్ణయం తీసుకున్నాడు. అలాగే చేశాడు కూడా. అది చాలా బాగా వచ్చింది.
సైకిల్ కి పెట్టిన మోటార్ చూసి.. అందరూ దాన్ని మోటార్ సైకిల్ అనడం మొదలుపెట్టారు. ఆ గ్రామంలో పిల్లలందరూ తమకి అటువంటి మోటారు సైకిలు కావాలని తమ తల్లిదండ్రుల వద్ద పేచీ పెట్టారు. దీంతో, డబ్బులు ఎలా సంపాదించాలి ? అనేది ఆ కుర్రాడికి అర్ధంఅయిపోయింది. మరోవైపు ఆ గ్రామ తల్లిదండ్రులు రిక్వెస్ట్ చేయడంతో ఆ కుర్రాడు మోటారు సైకిళ్ళను తయారు చేయడం స్టార్ట్ చేశాడు. అలా పుట్టుకొచ్చిందే హోండా మోటార్ సైకిల్. ప్రపంచ నెంబర్ వన్ మోటార్ సైకిల్ గా పేరు తెచ్చుకున్న హీరో హోండా మోటార్ సైకిల్ డిజైన్ ఆ కుర్రాడిదే. ఇంతకీ, ఆ కుర్రాడి పేరు ఏమిటో తెలుసా ? హోండా!
హోండా కంపెనీ (జపాన్) కార్ల తయారీలో టయోటాకి మంచి పోటీని ఇస్తోంది. హోండా కంపెనీలో పనిచేసేవారు తమని హోండామెన్ అని పిలుచుకుంటారు. ఈ హోండా కథ విన్న తర్వాత మనకేం అర్ధం అవుతుంది ?, నువ్వు నీ బిజినెస్ లో కష్టపడి కొత్తగా పని చేస్తే డబ్బు ఏ రూపంలో అయినా వస్తోంది. అన్నట్టు.. డబ్బులు ఎలా సంపాదించాలి ? అనే పాయింట్ పై హోండా ఓ మాట చెప్పారు. దానికి ఏ ఫార్ములా లేదు అని, ఐతే, నువ్వు చేసే పనికి నువ్వు ఓ కొత్త ఫార్ములాని కనిపెడితే డబ్బు దానంతట అదే వెతుక్కుంటూ వస్తోందని హోండా చెప్పారు.