టెనెంట్ మూవీ రివ్యూ : Tenant (Telugu) (2024) – Movie Cast and Crew
నటీనటులు : సత్యం రాజేష్, మేఘా చౌదరి, చందన పయ్యావుల, భరత్ కాంత్, ఎస్తేర్ నొరోన్హ, తేజ్ దిలీప్, ఆడుకాలం నరేన్, ధనా బాల, అనురాగ్, రమ్య పొందూరి తదితరులు.
కథ: యస్ శ్రీనివాస వర్మ,
స్క్రీన్ ప్లే : వై. యుగంధర్,
దర్శకత్వం: వై. యుగంధర్,
సంగీతం : సాహిత్య సాగర్,
సినిమాటోగ్రఫి : జెమిన్ జోమ్ అయ్యనేత్,
ఎడిటర్ : విజయ్ ముక్తవరపు,
నిర్మాత : మోగుళ్ళ చంద్రశేఖర్ రెడ్డి.
సత్యం రాజేష్ హీరోగా వచ్చిన ఫ్యామిలీ ఎమోషనల్ థ్రిల్లర్ “టెనెంట్”. వై.యుగంధర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా నేడు రిలీజ్ అయ్యింది. మరి ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో టెనెంట్ మూవీ రివ్యూ చూద్దాం రండి.
కథ విషయానికి వస్తే..
- గౌతమ్ (సత్యం రాజేష్) ప్రాణంగా ప్రేమించిన తన భార్య సంధ్యను (మేఘా చౌదరి) చంపేసి తగలబెట్టేస్తాడు. సంధ్యతో పెళ్లి అయిన దగ్గర నుంచి ఎంతో ప్రేమగా ఉన్న గౌతమ్.. అసలెందుకు తన భార్యను చంపాడు ?, వీరిద్దరి మధ్య ఏం జరిగింది ?, మరోవైపు రిషి (భరత్ కాంత్) గౌతమ్ పక్క ప్లాట్ లోనే ఉంటాడు. రిషి లవర్ శ్రావణి (చందన పయ్యావుల) ఇంట్లో నుంచి లేచిపోయి రిషి దగ్గరకు వస్తోంది. ఈ క్రమంలో జరిగిన కొన్ని సంఘటనల అనంతరం రిషి – శ్రావణి బిల్డింగ్ పై నుంచి దూకి చనిపోతారు ?, ఇంతకీ సంధ్యను నిజంగానే గౌతమ్ చంపాడా ?, గౌతమ్ మంచోడా ? చెడ్డోడా ?, మొత్తానికి ఈ రెండు జంటల జీవితాలు ఎలాంటి మలుపులు తిరిగాయి ? అనేది టెనెంట్ మూవీ రివ్యూలోని మిగిలిన కథ.
టెనెంట్ మూవీ రివ్యూలో పాజిటివ్ పాయింట్స్ :
- ఆడవాళ్లకు ఈ సమాజంలో ఎలాంటి రక్షణ లేదు అని వాస్తవిక కథనంతో ఈ టెనెంట్ కథ సాగింది. ఒక్కోసారి మంచివాళ్ళు ఏ తప్పు చేయకపోయినా జీవితాంతం శిక్ష అనుభవించాల్సి రావొచ్చు. ఈ టెనెంట్ సినిమాలో కూడా అదే మెయిన్ కోర్ పాయింట్. మొత్తానికి ఈ టెనెంట్ లో మెయిన్ థీమ్ తో పాటు థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో సాగే ఎమోషనల్ ప్లే కూడా బాగుంది. ముఖ్యంగా క్లైమాక్స్, సత్యం రాజేష్ ట్రాక్, భరత్ కాంత్ క్రైమ్ సీన్స్ బాగున్నాయి. సత్యం రాజేష్ కూడా చాలా సహజంగా నటించాడు. పాపం మేఘా చౌదరి నటన బాగున్నా.. ఆమె మేకప్ ప్రేక్షకులను ఇబ్బంది పెట్టింది.
- మరో హీరోయిన్ చందన పయ్యావుల హోమ్లీ లుక్స్ బాగున్నాయి. కానీ, ఈ గ్లామర్ లోకంలో ఈ లోకల్ బ్యూటీ నెట్టుకురావడం కష్టమే. ఈ సినిమా వరకు అయితే ఆమె ప్లస్ అయ్యింది. ఎస్తేర్ నొరోన్హాకి మంచి పాత్ర దక్కింది. కాకపోతే, బోల్డ్ పాత్రల్లో ఒదిగిపోవడం నేర్చుకున్న ఆమెకు, ఈ సీరియస్ పాత్ర సూట్ కాలేదు. కానీ, ఆమె పాత్ర చిత్రీకరణ మాత్రం ఆకట్టుకుంది. మిగిలిన నటీనటుల విషయానికి వస్తే.. తేజ్ దిలీప్, ఆడుకాలం నరేన్, ధనా బాల, అనురాగ్, రమ్య పొందూరి తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.
టెనెంట్ మూవీ రివ్యూలో నెగిటివ్ పాయింట్స్ :
- సత్యం రాజేష్ కి ఈ మధ్య హిట్లు రావడం, అలాగే, టెనెంట్ మూవీ ట్రైలర్ లో మ్యాటర్ ఉందనిపించడంతో ఈ సినిమా పై ఆసక్తి పెరిగింది. ప్రేక్షకుల ఫోకస్ కూడా ఈ చిత్రంపై పడింది. ఐతే, ప్రతి సినిమా ఒక జానర్లో ఉంటుంది. కానీ ఈ టెనెంట్ ఏ జానర్లో చెప్పమని పోటీ పెట్టొచ్చు. సినిమాలో గజిబిజి గందరగోళ కథ లేకపోయినా.. ఉన్న కథ మాత్రం గజిబిజిగానే సాగింది. దీనికితోడు, సినిమా చూస్తున్నంత సేపూ టెనెంట్ కథకి గమనం సరే.. గమ్యం ఎక్కడ ? ఇలాంటి ప్రశ్నలన్నీ తలలో తిరుగుతూ ఉంటాయి.
- టెనెంట్ మూవీ రివ్యూ కోసం అని నెగిటివ్ పాయింట్స్ రాయడం లేదు గానీ, నిజానికి ఈ టెనెంట్ మూవీ ఫస్ట్ హాఫ్ అంతా ఏ మాత్రం ఆసక్తి లేకుండా సాగింది. సీరియల్ టేకింగ్ కూడా బాగా విసిగించింది. ఇంటర్వెల్ కార్డ్ దగ్గర గానీ, కథలోకి టెనెంట్ మూవీ వెళ్ళదు. మొత్తానికి కథలో ఏ స్పార్క్ లేదు. చాలా కాంప్లికేటెడ్ కథని రాసుకుని ఈ టెనెంట్ ప్లేని గందరగోళ పరిచాడా, లేక గందరగోళంగా ఉంది కాబట్టి టెనెంట్ స్క్రీన్ ప్లే కాంప్లికేటెడ్ కథలా అనిపిస్తోందా అనేది దర్శకుడికే తెలియాలి.
- ఓవరాల్ గా ఈ టెనెంట్ మూవీ రివ్యూ ప్రకారం ఒక్కటి మాత్రం స్పష్టం. టెనెంట్ మూవీలో కొన్ని సీన్స్ మాత్రమే బాగున్నాయి. మిగిలిన బాగోతం అంతా రెగ్యులర్ రొట్ట కొట్టుడు వ్యవహారమే.
తీర్పు :
- మెసేజ్ ఓరియెంటెడ్ కాన్సెప్ట్ మూవీగా చూస్తే ఈ ‘టెనెంట్’ మూవీ పర్వాలేదు. కానీ, తెగిన గాలిపటం లాంటి కథనం ఎప్పుడు ఎక్కడ పడుతుందో చూడ్డమే తప్ప ప్రేక్షకులకి హుక్ అనేదే ఎక్కడా ఈ ‘టెనెంట్’ మూవీలో లేదు. దీంతో, ఈ సినిమా ఫలితం దెబ్బ తింది. టెనెంట్ మూవీ రివ్యూ లో ఉన్న సమాచారం కూడా సినిమాలో కొన్ని చోట్ల లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే.. ఎమోషనల్ మర్డర్ మిస్టరీ డ్రామాలు ఎప్పుడూ.. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ఉండాలి, సీరియల్ టేకింగ్ తో కాదు. ‘టెనెంట్’ జస్ట్ ఓకే.
టెనెంట్ మూవీ రివ్యూ రేటింగ్ : 2 / 5
పంచ్ లైన్ : మెసేజ్ ఓకే, కానీ మిస్టరే ఏది ?