టాప్ 7 బెస్ట్ బ్యూటీ టిప్స్ గురించి చెప్పకంటే ముందు.. మీకు తెలుసా ? వంటింటి వస్తువుల్లో కొన్ని సౌందర్య సాధనాలు. నేటి తరం అమ్మాయిలు తాము ధరించే వస్త్రాల పట్ల, తినే ఆహారం గురించి ఎక్కువ శ్రద్ధ చూపుతారు . కేశ సంరక్షణకు, చర్మ సౌందర్యం కోసం ఎన్నో క్రీమ్స్ వాడతారు. అయితే మీ అందాన్ని కాపాడే గొప్ప బ్యూటీ సీక్రెట్స్ మీ ఇంట్లోనే ఉన్నాయి. మీరు విన్నది నిజమే.. మీ వంటిల్లే ఓ సౌందర్య సాధనాల నిలయం. ప్రకృతిలో సహజంగా లభించే కొన్ని పదార్థాల ప్రభావం మన దేహం పై చాలా బాగా పని చేస్తాయి. వీటి గురించి తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు.
టాప్ 7 బెస్ట్ బ్యూటీ టిప్స్ లో ఫస్ట్ ది.
మరి వాటిల్లో మీకు సౌందర్య సాధనంగా ఉపయోగపడే అతి తక్కువ ఖరీదైనది ఏమిటో తెలుసా పాలు. రోజూ దూదిని గాని, మెత్తని గుడ్డ ముక్కను గాని పాలలో ముంచి దానితో ముఖాన్ని శుభ్రపరచుకోవాలి. దీనివల్ల ప్రతి రోజూ చర్మం కోల్పోతున్న సహజత్వం మళ్ళీ వస్తోంది. చర్మం రంగు మెరుగు పడుతుంది కూడా.
అలాగే, మరో టిప్. ఒక టీ స్పూన్ వెన్న తీసుకుని దానిని మరిగించి, రెండు టేబుల్ స్పూన్స్ పాలలో గిలకొట్టండి. ఆ మిశ్రమాన్ని మీ చర్మానికి పూసుకున్నట్లయితే ఎండిపోయినట్లున్న మీ చర్మం కళాకాంతులను వెదజల్లుతుంది. ముఖం కడుక్కుని శుభ్రంగా తుడుచుకున్నాక ఈ మిశ్రమాన్ని మీ ముఖానికి రాసుకోవాలి. ఉంచుకో గలిగినంత సేపు ఉంచు కుని ముఖాన్ని శుభ్రంగా కడుక్కోవాలి. ఆ తర్వాత చూస్కోండి పాలలోని తెల్లదనం మీ పేస్ లో కనిపిస్తోంది.
రెండో టిప్ దోసకాయ రసం అండోయ్ :
టాప్ 7 బెస్ట్ బ్యూటీ టిప్స్ లో ఇది రెండోది. దోసకాయ రసం మంచి యాస్ట్రింజెంట్ పనిచేస్తుంది. ఇది చర్మానికి మెరుపునిస్తుంది. కంటి మీద ఏర్పడే నల్లటి వలయాలను పోగొడుతుంది. దోసకాయ తో తయారు చేసిన మాస్క్ పూసుకుంటే చర్మం ఎంతో మృదువుగా తయారవుతుంది. దోసకాయ తినడం కూడా ఎంతో మంచిది. ఇది శరీరంలో వున్న విష పదార్థాలను, ఎక్కువయిన ఫ్లూయిడ్స్ ను తొలగిస్తుంది. కాబట్టి, దోసకాయ రసంతో అందాల రసాన్ని పొంగించండి.
టాప్ 7 బెస్ట్ బ్యూటీ టిప్స్ లో మూడోది :
బంగాళా దుంపలు అంటే మనందరికీ భయం. కారణం శరీరం లావు కావడానికి ఇవి దోహదం చేస్తాయన్న భావన. అయితే బంగాళా దుంపలు మంచి సౌందర్యాన్ని ఇస్తాయి. వీటిలో విటమిన్ ‘సి’ ఎక్కువగా వుంది. ‘ఎగ్జిమా’ రాకుండా సహాయపడుతుంది. అలాగే, కళ్ళ క్రింద గుత్తులుగా వేలాడే చర్మం మామూలు స్థితికి రావడానికి ఈ ఆహారం సాయపడుతుంది. దీనికితోడు, చర్మాన్ని మృదువుగా వుంచుతుంది. సన్నగా తరిగిన బంగాళాదుంప ముక్కల్ని ముఖానికి రుద్దుకుంటే చర్మం మృదువుగా తయారవుతుంది.
మరి నాలుగో టిప్ పరిస్థితేంటి ? :
క్యారెట్ లో విటమిన్ ‘ఎ’ ఎక్కువగా వుంటుంది. దీనిని రోజూ తీసుకోవడం వల్ల కళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి. క్యారెట్ దుంపల్ని కొద్దిగా నీళ్ళల్లో ఉడికించి, తర్వాత చల్లార్చి దంచి-మాస్క్ లా చర్మానికి పూసుకుంటే కళ్ళ కింద ఏర్పడిన నల్లటి వలయాలు తొలగిపోతాయి. చర్మం మృదువుగా తయారవుతుంది. కాబట్టి, క్యారెట్ ను ఎప్పటికీ నిర్లక్ష్యం చేయకండి.
టాప్ 7 బెస్ట్ బ్యూటీ టిప్స్ లో ఐదోది :
నిమ్మకాయ రసాన్ని రోజ్ వాటర్ కలిపి తయారు చేసిన మిశ్రమం మంచి హ్యాండ్ లోషన్ గా ఉపయోగపడుతుంది. అలాగే, తలస్నానం చేశాక, శిరోజాలను ఆరబెట్టు కాకమునుపే నిమ్మరసం, నీళ్ళతో కలిపి గాని, వేడి చేసిన ‘టి పాడి’ వీళ్ళతో గాని కలిపి శిరోజాలకు పట్టించాలి. అలా చేస్తే శిరోజాలు మెరుస్తాయి.