ఎన్టీఆర్ 32 war 2 movie : ఎన్టీఆర్.. హృతిక్ రోషన్ ‘వార్ 2’ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది. ఐతే, ప్రెజెంట్ జరుగుతున్న షెడ్యూల్ లో ఓ యాక్షన్ సీన్ కి సంబంధించి ఓ రెండు మూడు సిజి షాట్స్ కావాల్సి ఉంది. ఈ షాట్స్ ఇప్పటికే చేయించారు. కానీ, అవి సంతృప్తికరంగా లేక మళ్లీ చేయమని పంపారు దర్శకుడు అయాన్ ముఖర్జీ. జస్ట్ రెండు షాట్లే కదా, సినిమా అంతా బాగున్నపుడు ఈ షాట్స్ తో సమస్య ఏమీ ఉండదు కదా.. ఉంచేదాం అని నిర్మాతలు అంటే.. అయాన్ ముఖర్జీ మాత్రం ఒప్పుకోవడం లేదు. కారణం.. ఈ షాట్స్ ఎన్టీఆర్ ఇంట్రడక్షన్ షాట్స్ అట. విజువల్ వండర్ గా ఈ షాట్స్ ఉంటాయని తెలుస్తోంది.
సినిమాలో ( ఎన్టీఆర్ 32 war 2 movie ) ఎక్కడా ఎన్టీఆర్ పాత్ర పై వంక పెట్టడానికి లేకుండా వుండాలన్నది దర్శకుడు అయాన్ ముఖర్జీ ఆలోచన. అందువల్ల ఆ సిజి ల వర్క్ విషయంలో ఎక్కడా రాజీ పడటం లేదు. ఇక వార్ 2 విడుదల డేట్ మాత్రం ఇంకా క్లారిటీ లేదు. కాకపోతే, మేకర్స్ 2025 ఆగస్టు 14న విడు
ఇవన్నీ ఇలా వుంటే సినిమా డిజిటల్ రైట్స్ అమ్మకాల కోసం గట్టి పోటీ ఉంది. డీల్ ఇంకా పూర్తి కాలేదు కనుక, ఎమౌంట్ ఫైనల్ కాలేదు గాని, ఇండియన్ బాక్సాఫీస్ షేక్ అయ్యే రేంజ్ లో వార్ 2 డిజిటల్ రైట్స్ కి రేటు ఉంటుందని టాక్. పైగా హృతిక్ రోషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎన్టీఆర్ పాత్రను పరిచయం చేస్తూ ఆ మధ్య వదిలిన గ్లింప్స్ కూడా జనాలను బాగా ఆకట్టుకుంది. అలాగే, ఎన్టీఆర్ పాత్ర ఈ సినిమా డ్యూయెల్ రోల్ కావడం, అటు హృతిక్ రోషన్ సైతం ఈ సినిమా కోసం ప్రత్యేక కసరత్తులు చేయడం వంటి అంశాలు వార్ 2 రేంజ్ ను రోజురోజుకు పెంచుతున్నాయి.
ఎన్టీఆర్ 32 war 2 movie (వార్ 2) షూటింగ్ అప్ డేట్స్ ఏమిటి ?
మార్చి ఫస్ట్ వీక్ నుంచి వార్ 2 షూట్ స్టార్ట్ అయ్యింది. హృతిక్ కి సంబంధించిన కీలక సన్నివేశాలను షూట్ చేశారు. మార్చి 7న ముంబైలోని యష్ రాజ్ ఫిల్మ్స్ స్టూడియోస్‌లో వార్ 2 పూజా కార్యక్రమాలు జరిగాయి. ఇక ఈ ఏప్రిల్ నుంచి జూనియర్ ఎన్టీఆర్ వార్ 2 షూటింగ్ జాయిన్ అయ్యాడు. జూలై వరకూ తారక్ వార్ 2 కోసం డేట్స్ ఇచ్చాడు.
అసలు, వార్ 2 ( ఎన్టీఆర్ 32 war 2 movie ) బడ్జెట్ ఎంత?
ఈ ప్రాజెక్ట్ కోసం యష్ రాజ్ ఫిలిమ్స్ దాదాపు 350 కోట్ల రూపాయల బడ్జెట్‌ను పెడుతుంది. ఎన్టీఆర్ దాదాపు వార్ 2 షూటింగ్ కోసం 120 రోజులు డేట్స్ ఇచ్చాడు.
వార్ 2 సినిమా కథ ఎలా ఏమిటి ?
హృతిక్ రోషన్ మేజర్ కబీర్ గా వార్ 2 లో కనిపించబోతున్నాడు. ఐతే, కబీర్ కి ఓ అతి పెద్ద సమస్య వస్తోంది. ఆ సమస్య భారత దేశానికి కొత్త ముప్పును తీసుకొస్తోంది. ఆ సమస్యను కబీర్ ఎదుర్కోవడానికి ఓ ప్రమాదకరమైన సీక్రెట్ మిషన్ ను రెడీ చేస్తాడు. ఇంతకీ ఆ మిషన్ ఎవరి కోసం ?, అసలు భారత దేశానికి వచ్చిన కొత్త ముప్పు ఏమిటి ?, ఈ మొత్తం కథ ఎన్టీఆర్ పాత్ర ఎలా మలుపు తిప్పబోతుంది ? అనేది కథ.
వార్ 2 లో ఎన్టీఆర్ పాత్ర ఏమిటి ?
‘వార్ 2’లో ఎన్టీఆర్ విలన్‌గా నటిస్తున్నాడు అని గతంలో వచ్చిన వార్తలు నిజం కావు. ఈ సినిమాలో ఓ భారతీయ ఏజెంట్ పాత్రలో ఎన్టీఆర్ కనిపిస్తాడు. కానీ, కథ మొత్తం ఎన్టీఆర్ పాత్ర చుట్టే తిరుగుతుందట.
వార్ 2 (ఎన్టీఆర్ 32 war 2 movie ) హీరోయిన్ ఎవరు?
స్టార్ కాస్ట్ లో ఎన్టీఆర్, హృతిక్ రోషన్ ఉండే సరికి.. వార్ 2లో మిగిలిన నటీనటులు ఎవరు ? అనేది పెద్దగా పట్టింపు లేకుండా పోయింది. ఐతే, ప్రస్తుతానికి కియారా అద్వానీ ఈ సినిమాలో హీరోయిన్ గా ఎంపిక అయ్యింది.
వార్ 2 విలన్ ఎవరు?
వార్ 2 లో విలన్ గా బాబీ డియోల్ కనిపించబోతున్నాడు.
వార్ 2 రైటర్ ఎవరు?
వార్ 2 కి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నా.. ఈ సినిమాకు రైటర్స్ మాత్రం ఆదిత్య చోప్రా, శ్రీధర్ రాఘవన్. ఓ భారీ యాక్షన్-థ్రిల్లర్ గా ఈ వార్ 2 స్క్రిప్ట్ ను వారు మలిచారు. అలాగే, యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మిస్తోన్న స్పై యూనివర్స్‌లో ఈ చిత్రం ఆరవ భాగం. అందుకే, బాలీవుడ్ లో వార్ 2 పై భారీ అంచనాలు ఉన్నాయి.
వార్ 2 షూటింగ్ ఎప్పుడు పూర్తి అవుతుంది ?
ఇప్పుడున్న సమాచారం ప్రకారం.. వార్ 2 వచ్చే ఏడాది మార్చి నెలకు పూర్తి అవుతుంది అని మేకర్స్ చెబుతున్నారు. మరి అనుకున్న డేట్ కి ఘాట్ పూర్తి చేయగలరో లేదో చూడాలి.