ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ సినిమా కథ విషయానికి ముందు ఒక ముచ్చట ఉంది. ఆర్ఆర్ఆర్ లో ఎన్టీఆర్ కి అన్యాయం జరిగిందని బాగా ప్రచారం జరిగింది. ఆ ప్రచారం మాట ఎలా ఉన్నా.. వార్ 2 సినిమాకి ఎన్టీఆర్ సైన్ చేశాడు. దీంతో బాలీవుడ్ లో ఎన్టీఆర్ విలన్ గా నటిస్తున్నాడు అంటూ పుకార్లు పుట్టించారు. ఆ మాట కొస్తే హృతిక్ రోషన్ కన్నా ఎన్టీఆర్ కే ఇప్పుడు మార్కెట్ ఎక్కువ ఉంది. పైగా వరుసగా ఆరు హిట్లు ఇచ్చిన ఏకైక సౌత్ హీరో. అలాంటి ఎన్టీఆర్ పాన్ ఇండియా రేంజ్ లో భారీ విజయాన్ని అందుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఓ విధంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆకలి మీద ఉన్నారు. ఇలాంటి సమయంలో బాలీవుడ్ మీడియా ఎన్టీఆర్ ను విలన్ చేసింది. ఇప్పుడు బాలీవుడ్ మాఫియాను ఈసడించుకునేవారు సైతం ఎన్టీఆర్ జాతీయ స్థాయిలో బలంగా నిలబడాలని కోరుకుంటున్నారు.
ఈ క్రమంలోనే ఇప్పుడు అందరీ చూపు ప్రశాంత్ నీల్ – ఎన్టీఆర్ పై పడింది. ఈ సినిమాతో ఎన్టీఆర్ కు పెద్ద రిలీఫ్ అవసరం. సోలోగా పాన్ ఇండియా స్టార్ అనిపించుకోవడం అవసరం. ఖచ్చితంగా ప్రశాంత్ నీల్ సినిమా ఆ అవసరాన్ని తీరుస్తోంది అని నమ్మకం. ఎన్టీఆర్ అంటేనే యాక్షన్ సీన్లు దడదడ… నెత్తురు, హింస, బీభత్సం… పైగా ఎన్టీఆర్ నటనా సామర్థ్యం. వీటికి తోడు ప్రశాంత్ నీల్ సినిమాలు కూడా అంతే… ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇది కేజీఎఫ్, సలార్ సినిమాలకు మించి ఉంటుంది. పక్కా మాస్ ఎలిమెంట్స్ తో ఎన్టీఆర్ విలన్స్ ను గబగబా దంచుతూ వెళ్లిపోతే థియేటర్స్ పరిస్థితి ఏమిటో.. పైగా ఎక్కడా గ్రిప్ సడలకుండా ఒక బిగితో కథ నడిపించడంలో ప్రశాంత్ నీల్ కి మంచి అనుభవం ఉంది.
ఈ సినిమా కథా నేపథ్యం ఇదేనట
ఆ మాటకొస్తే.. ఈ సినిమా కథే కాదు, ఓ రొమాన్స్ అక్కర్లేదు, కామెడీ ఫ్లేవర్ పీల్చక్కర్లేదు. భారీ ఎమోషన్స్ తో కూడిన యాక్షన్స్ ఉంటే చాలు. ఆ ఎమోషన్ కి ఎన్టీఆర్ నటన, ప్రశాంత్ నీల్ యాక్షన్ తోడు అయితే, ఇక కథాకాకరకాయ గురించి చెప్పుకోవడం కూడా దండుగే. ప్రశాంత్ నీల్ మార్క్ ప్రజెంటేషన్ అలా ఉంటుంది మరి. ఐతే, తాజాగా ఈ సినిమా కథ గురించి, కథా నేపథ్యం గురించి ఓ క్రేజీ న్యూస్ వినిపిస్తోంది. సేమ్, కేజీఎఫ్ బాపతు నేపథ్యంతోనే ఎన్టీఆర్ సినిమాని కూడా ప్రశాంత్ నీల్ ప్లాన్ చేస్తున్నాడు. సలార్ సినిమా ఎక్కడో ఓ బొగ్గు గని ఏరియాలో అనామకంగా గడుపుతున్న హీరోని చూపించాడు. అయినా హిట్ కొట్టాడు. ఇప్పుడు ఎన్టీఆర్ తో కూడా అలాంటి భారీ యాక్షన్ సినిమా చేస్తున్నాడు. కాకపోతే, దేశం బోర్డర్ లో ఈ కథ ఉంటుంది. పాకిస్థాన్ – భారత్ యుద్ధం నేపథ్యంలో ఈ కథ సాగనుంది. కథా నేపథ్యం మొత్తం యుద్ధ వాతావరణంలో ఉండనుంది.
ఎన్టీఆర్ కోసం ప్రశాంత్ నీల్ మాస్ ఎలిమెంట్స్
ఎప్పటిలాగే కథలో కుట్రలు, యుద్దాలు, హీరో అజ్ఞాతంలోకి వెళ్లడం, వీటి మధ్యలో ఎన్టీఆర్ కు ఫుల్లు ఎలివేషన్… మరి ప్రశాంత్ నీల్ బాపతు ఎలివేషన్స్ అలాగే ఉంటయ్…ఎన్టీఆర్ కు ఆ ఎలివేషన్స్ సూట్ అవుతాయి కూడా. తన ముందు ఎంత పెద్ద విలన్స్ ఉన్నా వారు అందరూ తేలిపోతారు. ఎస్, ఎన్టీఆర్ ఈ సినిమాతో బాలీవుడ్లో బలంగా నిలబడే ఆవకాశం కనిపిస్తుంది… నిజంగానే ప్రశాంత్ నీల్ సినిమా ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు ఫుల్ జోష్ ను ఇవ్వబోతుంది.
ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ సినిమా పలు ఇంట్రెస్టింగ్ విషయాలు :
ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ సినిమా షూటింగ్ ఎప్పుడు ?
నిజానికి ఈ పాటికే ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ కావాలి. కానీ, దేవర పార్ట్ 1 సినిమా రిలీజ్ పోస్ట్ ఫోన్ కావడంతో ఎన్టీఆర్ ఈ సినిమా షూటింగ్ ను పోస్ట్ ఫోన్ చేశాడు. ఇప్పడున్న అప్ డేట్ ప్రకారం.. ఈ ఏడాది నవంబర్ తర్వాత ఎన్టీఆర్ ఈ సినిమాని సెట్స్‌పైకి తీసుకు వెళ్లే అవకాశం ఉంది. ఈ లోపు ప్రశాంత్ నీల్ ‘సలార్ 2’ని ఫినిష్ చేస్తాడట.
ఈ సినిమా టైటిల్ ఏమిటి ?
ప్రస్తుతానికి అభిమానులు ఈ సినిమాకి NTR 31 అని టైటిల్ పెట్టుకున్నారు. ఐతే, దేవర రెండు పార్ట్స్ గా రాబోతుంది కాబట్టి, ఈ సినిమా వర్కింగ్ టైటిల్ NTR 32 అవుతుంది. ఇక ఆల్రెడీ ఈ సినిమాకి ప్రశాంత్ నీల్ టైటిల్ ను ఖరారు చేసినట్లు టాక్. ఎన్టీఆర్ పుట్టినరోజు నాడు ఈ సినిమా టైటిల్ పై అధికారిక ప్రకటన ఇస్తారట.
ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ సినిమా Budget ఎంత ?
ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ సినిమా అంటేనే భారీ బడ్జెట్ ఉంటుంది. దాదాపు రూ.350 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ సినిమాని నిర్మించబోతున్నారని తెలుస్తోంది. ఒకవేళ ఈ వార్త నిజం అయితే ఎన్టీఆర్ కెరీర్ లోనే ఈ బడ్జెట్ అత్యధికం కానుంది.
ఈ సినిమా కోసం ఎన్టీఆర్ రెమ్యునరేషన్ ఎంత ?
ప్రస్తుతం దేవర సినిమాకి ఎన్టీఆర్ తీసుకుంటున్న రెమ్యూనరేషన్, దాదాపు ₹90 కోట్ల వరకూ ఉంటుందని.. అలాగే లాభాల్లో 20 % షేర్ కూడా ఉంటుందని తెలుస్తోంది. కానీ ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ కోసం మాత్రం ఎన్టీఆర్ మరింత ఎక్కువ అందుకోకున్నాడు. దాదాపు రూ.150 కోట్లు పైనే అని టాక్.