అమ్మ ఒడి పథకం : 2024లో  కొత్త మార్పులు 

అమ్మ ఒడి పథకం 2024లో  కొత్త మార్పులు : బహుశా మన దేశంలో  ఏ పథకానికి రానన్ని విమర్శలు వచ్చాయి ఈ పథకం పై.  నిజానికి దీని ఉద్దేశం మంచిదే.  పేదరికం చదువుకు అడ్డు రాకూడదు, ప్రతి తల్లీ తమ బిడ్డలను చదివించాలి.. అందుకు వారికీ ఇస్తున్న చేయూతే ఈ పథకం. ఐతే, 2024 – 25 కాలంలో ఈ అమ్మ ఒడి పథకంలో చాలా మార్పులు రాబోతున్నాయి.  తమ పిల్లలను బడికి పంపేలా ప్రోత్సహించేందుకు ఇప్పటివరకూ తల్లి బ్యాంకు ఎకౌంట్ కు నేరుగా రూ.13000 /- ను వేస్తున్నారు. ఎన్నికల అనంతరం ఈ పథకానికి అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరికి ఇంకా ఎక్కువ లబ్ధి చేకూర్చేలా ప్రభుత్వం అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటుంది. మరి 2024 – 25లో ఈ పథకం గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం రండి.     

అమ్మ ఒడి పథకం  2024 – 25 నుంచి ఇలా  

వైఎస్ఆర్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని మొదలైన ఈ పథకం ద్వారా  ఆంధ్ర రాష్ట్రంలోని పేద, నిరుపేద తల్లులకు ప్రతి ఏడాది రూ.13000 /- ను  ఇస్తూ వస్తున్నారు. ఈ పథకంలో భాగంగా  ఈ ఏడాది వరకూ  43 లక్షల మంది తల్లులకు ఆర్థిక సహాయం అందింది. ఐతే, 2024 – 25 నుంచి మాత్రం మరో 8 లక్షల మందికి ఈ పథకం వర్తించేలా అప్లికేషన్స్ ను ప్రాసెస్ చేస్తున్నారు. అంటే.. ఈ ఏడాది నుంచి మొత్తం 51 లక్షల మంది తల్లులకు ఆర్థిక సహాయం అందనుంది. అలాగే, బాగా చదివే పిల్లలకు మెరిట్ కోటాలో ప్రత్యేక ప్రోత్సాహాలు ఇవ్వనున్నారు.  

 

అమ్మ ఒడి పథకం  లేటెస్ట్ అప్‌ డేట్ : 

 

2024వ ఏడాదికి రూ. 6392.94 కోట్ల ఆర్థిక సహాయాన్ని జగన్ మోహన్ రెడ్డి విడుదల చేశారు.  ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ఫ్లాగ్‌ షిప్ ప్రోగ్రామ్ ద్వారా ఈ పథకం డబ్బులు అందుతున్నాయి. మొత్తం 83,15,341 మంది విద్యార్థుల తల్లులకు డబ్బు అందింది. ఇప్పటి వరకు ఈ పథకం ద్వారా మొత్తం రూ. 26000 కోట్ల రూపాయలను లబ్ధిదారులకు ఇచ్చారు.

ఐతే, ఈ స్కీమ్  లేటెస్ట్ అప్ డేట్ ప్రకారం.. బాగా చదివే పిల్లలకు మెరిట్ కోటాలో ప్రత్యేకమైన ప్రోత్సాహాలను అందించాలని ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. ముఖ్యంగా మెరిట్ స్టూడెంట్స్ పై చదువులకు భరోసా కల్పించేలా ఈ పథకంలో మార్పులు చేయబోతున్నారు. 

 

కొత్త మార్పులు వల్ల  ఈ స్కీమ్ ప్రయోజనాలు ఇవే :  

 

  • 2024 – 25 ఏడాది నుంచి  అమ్మ ఒడి పథకంలో చేసిన మార్పుల కోసం రాష్ట్ర ప్రభుత్వం అదనంగా రూ.4318 కోట్ల రూపాయలను ఈ పథకం కింద కేటాయించబోతుంది.  

 

  • అదే విధంగా రాష్ట్రవ్యాప్తంగా ఈ పథకాన్ని విజయవంతంగా అమలు చేసేందుకు.. ముఖ్యంగా  ప్రతి పిల్లవాడు ఇంటర్ మీడియట్ తర్వాత కూడా  చదువుకునే విధంగా ఈ పథకంలో వీలు కల్పించనున్నారు. ఐతే, అందుకు  75 % మార్కులు ఎక్కువ వచ్చి ఉండాలి.       

 

  • ఏది ఏమైనా ఎవరు ఎన్ని విమర్శలు చేసినా  ఈ పథకం కారణంగా ఆంధ్రప్రదేశ్ లో అక్షరాస్యత రేటు బాగా మెరుగుపడింది.  అలాగే, బాల కార్మికుల సంఖ్య కూడా  ఈ స్కాలర్‌షిప్ పథకం కారణంగా బాగా తగ్గింది. 
 
  • అమ్మఒడి పథకం లక్ష్యం అదే. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పేద విద్యార్థులకు చదువు పై ఆసక్తి కలిగించేలా.. వారి పేదరికానికి చేయూతని ఇచ్చేలా ఈ పథకం బాగా తోడ్పాటుగా నిలుస్తోంది.  1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న పేద విద్యార్థులకు ఈ పథకం గొప్ప వరం.

 

2024 - 25 లో  అమ్మ ఒడి పథకంలో కొత్త మార్పులు చేశారు.  అవి ఇవే  Telugu Needs
2024 – 25 లో అమ్మ ఒడి పథకం

 

అమ్మ ఒడి పథకం పై  పలు ప్రశ్నలు – సమాధానాలు :   

 

2024 – 25 లో ఈ పథకం కోసం ఎంత మంది లబ్ధిదారులను ఎంపిక చేయబోతున్నారు ?

2024 – 25 ఏడాది గానూ.. 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ స్థాయి వరకు సుమారు 84 లక్షల మంది విద్యార్థులు  ఈ పథకం ద్వారా  లబ్ధి పొందే అవకాశం ఉంది.

2024 – 25 లో ఈ  స్కీమ్  ద్వారా ఆర్థిక సహాయం ఎంత ఉండబోతుంది ?

2024 – 25 ఏడాది కింద, ఈ పథకం ద్వారా ప్రతి తల్లికి ఏడాదికి గానూ రూ. 15000/- అందించాలి అని నిర్ణయం తీసుకున్నారు. అంటే ఎలాంటి కట్టింగ్ లు లేకుండా పూర్తిగా రూ. 15000/- ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నారు. 

       

2024 – 25 లో అమ్మ ఒడి పథకం లక్ష్యం ఏమిటి ?

ఇన్నేళ్లలో జరిగిన పొరపాట్లను ఈ ఏడాది నుంచి జరగకుండా ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఈ పథకం అందేలా ప్రత్యేకంగా అవగాహన కల్పించనున్నారు. అదేవిధంగా పథకానికి అప్లై చేసుకునే ప్రాసెస్ ను కూడా సులభతరం చేయనున్నారు.           
 
 

ఈ  స్కీమ్  వల్ల పేద బిడ్డలకు నిజంగానే మంచి  జరుగుతుందా ? 

మంచి అనే మాట పక్కన పెడితే.. తమ పిల్లలను  బడికి పంపితే ఏటా  ప్రభుత్వం రూ.13 వేలు ఇవ్వడం అనేది నిజంగా పేదోళ్లకు గొప్ప వరమే. డబ్బుల కోసమైనా  కొందరు పేదలు తమ పిల్లలను చదివిస్తున్నారు. మంచి జరుగుతుంది అంటే.. అది మాత్రమే.

 

అమ్మ ఒడి పథకం వివరాలు 2024 : ఈ ఐదేళ్లల్లో ఎంత డబ్బు వచ్చింది ?     

అమ్మ ఒడి పథకం ద్వారా మొదటి విడతలో రూ.15వేలు పడ్డాయి. రెండో విడతలో మాత్రం కేవలం రూ.14 వేలే పడ్డాయి. ఆ తర్వాత  3, 4 విడతల్లో ఐతే, కేవలం రూ.13 వేలు మాత్రమే పడ్డాయి. ప్రతి ఏడాది ఎమౌంట్ తగ్గుతూ వస్తోంది. జగన్ ప్రభుత్వం మొదట రూ.15వేలు ఇస్తాం అని హామీ ఇచ్చింది. కానీ, ఆ హామీని నిలబెట్టుకోలేకపోయింది. కానీ, 2024 -25 ఏడాది నుంచి రూ.15వేలు తగ్గకుండా ఇస్తాం అంటున్నారు. మరి ఎలా ఇస్తారో చూడాలి.           

తల్లులకు ఈ పథకం ఆసరా ? 

పేదరికంలో మగ్గుతున్న పిల్లల తల్లులకు అమ్మఒడి నిజంగానే గొప్ప ఆసరా.  కూలి పనులు చేసుకుని బిడ్డలను చదివించుకోలేక మధ్యలోనే చదువు మాన్పించి వాళ్లు ఎందరో ఉన్నారు. వారంతా ఇప్పుడు తమ పిల్లలను చదివిస్తున్నారు.

 

Leave a Comment