సాయిపల్లవి..  ఆ స్టెప్పులు నావల్ల కాదు 

సాయిపల్లవి.. మనకున్న కొందరు మంచి నటీమణుల్లో ఆమె ఒకరు…మలయాళీ కుటుంబంలో పుట్టిన సాయి పల్లవి ది ఓ డిఫరెంట్ పర్సనాలిటీ… ఓ హీరోయిన్ కి ఉండాల్సిన లక్షణాలు ఆమెలో కనిపించవు. సాయి పల్లవి మెంటాలిటీ, థింకింగ్ రేంజ్, ఆలోచనల డెప్త్ సగటు నటీమణుల్లో అస్సలు ఫిట్ కాదు… చిన్నప్పుడు సాయిపల్లవి మంచి డాన్సర్.  తర్వాత శిక్షణ పొందిన నటి… సినిమాలు… తెలుగు, మలయాళం, తమిళం, ప్రస్తుతం హిందీ భాషలో.. ఇలా  పలు చిత్రాలు… అయినా, ఎడాపెడా సినిమాలు ఒప్పేసుకునే బాపతు కూడా కాదు సాయి పల్లవి… చాలామంది ఆమె మంచి డ్యాన్సర్ మాత్రమే అనుకుంటారు. ఎవరికీ తెలియదు గానీ, మలయాళంలో ఆమె  ఓ సినిమాకు డాన్స్ కూడా  కంపోజ్ కూడా చేసింది.

అంతేనా, సాయి పల్లవికి  కెమెరా మీద మంచి పట్టుంది… రచన పై మమకారం ఉంది. ఇక బాష ఏదైనా సొంతంగా డబ్బింగ్ చెబుతుంది… భవిష్యత్తులో డైరెక్టర్ కూడా అవుతుందేమో… సాయి పల్లవిలో అంత మ్యాటర్ ఉంది. పైగా ఆమె నిర్మాతల నటి. డిమాండ్ ఉంది కదా అని, అడ్డుఅదుపు లేకుండా డబ్బులు వసూలు చేయదు. పైగా సాయిపల్లవికి పెద్ద, చిన్న హీరోలనే తేడా ఏమీ లేదు, తనకు కథ నచ్చితే చాలు, ఆ సినిమా చేసేస్తుంది, లేదంటే వదిలేస్తుంది… తను నటించే ప్రతి సినిమాలోనూ తనదే డబ్బింగ్, ఆయా భాషల్లో ఫ్లుయెన్సీ కోసం వాటిని నేర్చుకుంటుంది కూడా… ఏదో తమిళ సినిమాలో గ్లామర్ పాత్ర కూడా వేసినట్టుంది… మొత్తంగా సాయి పల్లవి ది ఓ డిఫరెంట్ కేరక్టర్.

 

సాయిపల్లవిలో ఆ యాంగిల్ కూడా ఉంది

ప్రస్తుతం సాయి పల్లవి హిందీ రామాయణంలో నటిస్తోంది. ఐతే, ఓ మలయాళ పత్రిక కు ఇచ్చిన తాజా ఇంటర్వ్యూ   సాయిపల్లవి లోని మరో కోణాన్ని టచ్ చేసింది… అసలు ఆమె ఇంటర్వ్యూలే పెద్దగా ఇవ్వదు… రొటీన్ ప్రశ్నలు, ఫార్ములా సినిమా ఇంటర్వ్యూలు అంటే సాయిపల్లవి చిరాకుపడుతుంది. ఐతే, సాయి పల్లవిలో మనకు అంతగా తెలియని ఓ స్పిరిట్యుయల్ యాంగిల్ కూడా ఉంది,  సరే, దాన్నలా వదిలేస్తే, ఇంటర్వ్యూలో ఓ అంశం కొత్తగా అనిపించింది… మీరు ఆచితూచి కేరక్టర్లను ఎంపిక చేసుకుంటున్నారు. 

మీ కకెరీర్ లో మీరు ఇప్పటివరకూ పెద్దగా వెకిలి పాత్రల జోలికి పోలేదు. ఐతే, మన సౌత్  సినిమాల్లో హీరోయిన్లకు వేరే పనేమీ ఉంటుంది ?, హీరోల పక్కన పిచ్చి పాటలకు ఎక్స్‌పోజింగ్, మసాలా గంతులేయడమే హీరోయినిజం కదా… మరి ఆ హీరోయినిజం నుంచి సాయిపల్లవి ఎలా తప్పించుకుంటూ వస్తోంది ? మంచి ప్రశ్న.  సాయి పల్లవి సమాధానం ఇలా సాగింది. నేను అందరి హీరోయిన్స్ లా  ఆ గెంతులు వేయలేను. బాగా ఇబ్బంది పడతాను.  ఊ అంటావా, ఉ ఊ అంటావా అంటూ ఆ ఊపుళ్లు నాకు సెట్ కావు. నిజానికి  నేను నాట్యం నేర్చుకున్నాను… చిన్నప్పటి నుంచే నాకు భరతనాట్యం తెలుసు. సాయి పల్లవి ఢీ అనే షోతోనే తెలుగు ప్రేక్షకులకు తెలుసు.

 

ఆ నడుం ఊపుళ్లకు నేను దూరం

సాయిపల్లవి ఇంకా మాట్లాడుతూ..  ‘కానీ, నాకు సినిమా డాన్సులంటే ఏదో కాస్త ఇబ్బందిగా ఉంటుంది. ఐతే, నాకు నా డ్యాన్స్ వల్లే పేరు వచ్చింది. అలాంటి పేరు తెచ్చే పాటలు చేయడానికి నేను ఎప్పుడు ముందు ఉంటాను. కానీ ఆ నడుం ఊపుళ్లకు  ఆ రకం స్టెప్పులకు మాత్రం నేను దూరం. అలాంటి స్టెప్పులు నేను అసలు వేయను’ అని సాయిపల్లవి చెప్పుకొచ్చింది. ఐతే, సదురు మలయాళ యాంకర్ మాత్రం ప్రత్యేకించి ఆ నడుం ఊపుళ్లు గురించే మళ్లీ మళ్లీ అడిగింది. ఎన్నిసార్లు అడిగినా సాయి పల్లవి మాత్రం.. నవ్వుతూనే సమాధానం చెప్పింది. ఆ హాట్ మూమెంట్స్  తనకు కాస్త వికారంగా ఉంటయ్, అందుకే, అవి తన వల్ల కాదు అని మొత్తానికి సాయి పల్లవి క్లారిటీ ఇచ్చింది.

 

సాయి పల్లవి గురించి  పలు ఇంట్రెస్టింగ్ విషయాలివే :

సాయిపల్లవి కి ఇప్పటివరకు ఎన్ని అవార్డులు వచ్చాయి ?

సాయి పల్లవి కి ఇప్పటివరకు వచ్చిన అవార్డులు జాబితా పెద్దదే. సాయిపల్లవి కి  నాలుగు ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ వచ్చాయి. అలాగే,  రెండు సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్‌ కూడా ఆమెకు దక్కాయి. వీటితో పాటు రాష్ట్ర స్థాయి అవార్డ్స్ కూడా ఆమెకు వచ్చాయి. అన్నిటికీ మించి ప్రేక్షకుల  ప్రశంసలను ఆమె అందుకుంది.

 

సాయిపల్లవి పారితోషికం ఎంత ?

పారితోషికం విషయంలో సాయి పల్లవి మొదటి నుంచి నిర్మాతలకు అనుగుణంగానే ఉంది. ప్రస్తుతం సాయిపల్లవి సౌత్‌లో ఒక్కో సినిమాకు గానూ  రూ.2.5 నుంచి 3 కోట్ల వరకు  తీసుకుంటోంది. అయితే, నితీష్ తివారీ రామాయణం కోసం మాత్రం, సాయిపల్లవి ఏకంగా రూ.6 కోట్ల రూపాయలను  పారితోషికంగా  తీసుకుంటుంది.

 

సాయిపల్లవి ఎంబీబీఎస్ ఎక్కడ పూర్తి చేసింది ?

మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాచే గుర్తింపు పొందిన టిబిలీసి స్టేట్ మెడికల్ యూనివర్సిటీ లో సాయి పల్లవి 2016లో తన వైద్య విద్యను పూర్తి చేసింది.

 

తన చెల్లి పెళ్లి అయినా, సాయిపల్లవి ఇంకా ఎందుకు పెళ్లి చేసుకోలేదు ?

సాయి పల్లవి ఓ ఇంటర్వ్యూలో తన పెళ్లి పై మాట్లాడుతూ.. మరో రెండేళ్ల తర్వాత తాను పెళ్లి చేసుకుంటాను అంటూ ఆమె క్లారిటీ ఇచ్చింది. అలాగే ప్రస్తుతం సాయిపల్లవి దృష్టి మొత్తం సినిమాల పైనే ఉంది.

Leave a Comment