ఎన్టీఆర్ కు భారీ అడ్వాన్స్ : బాలీవుడ్ లో ‘వార్ 2’ కాకుండా ఎన్టీఆర్ మరో సినిమా చేయబోతున్నారని వార్తలు వెల్లడించిన సంగతి తెలిసిందే. టీ సిరీస్ నిర్మాణ సంస్థతో ఎన్టీఆర్ ఓ సినిమా కమిట్ అయినట్లు తెలుస్తోంది. మిగిలిన వివరాలు ఎలా వున్నా, ఈ సినిమా కమిట్ కావడం వెనుక సౌత్ మార్కెట్ దాగి వుందన్న వార్తలు టాలీవుడ్ లో గుప్పుమని వినిపిస్తున్నాయి. బాలీవుడ్ లో టీ సిరీస్ నిర్మాణ సంస్థకు మంచి పేరు ఉంది. సౌత్ లో మంచి పేరు తెచ్చుకోవాలని సదరు సంస్థ టార్గెట్. అందుకే, ఎన్టీఆర్ డేట్స్ కోసం గత ఏడాది నుంచి తీవ్రంగా ప్రయత్నాలు చేస్తూ వచ్చింది. పైగా అడ్వాన్స్ రూపంలో యాభై కోట్ల సింగిల్ పేమెంట్ కూడా చేసింది.
ఈ ఒక్క సినిమా గానూ ఎన్టీఆర్ కి 120 కోట్ల రెమ్యూనిరేషన్, యాభై కోట్ల అడ్వాన్స్ అనే డీల్ కుదిరింది. బహుశా ఈ రేంజ్ భారీ రెమ్యునరేషన్ మరో ఏ హీరోకి లేదు. ప్రభాస్ 100 కోట్ల రేంజ్ లో ఉన్నాడు. ఎన్టీఆర్ ఆ రేంజ్ ను కూడా దాటేశాడు. అందుకు ప్రధాన కారణం.. వార్ 2. ఈ సినిమా పై బాలీవుడ్ లో భారీ అంచనాలు ఉన్నాయి. ఐతే, సినిమాలో ఎన్టీఆర్ పాత్ర అద్భుతంగా ఉంటుందట. బలమైన పాత్ర పడితే.. తారక్ నటన ఏ స్థాయిలో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎలాగూ నార్త్ లో ప్రతిభకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. ఆ రకంగా చూసుకున్నా.. వార్ 2 రిలీజ్ తర్వాత, ఎన్టీఆర్ రేంజ్ డబుల్ అవుతుంది. అప్పుడు ఎన్టీఆర్ కు ఎంత భారీ అడ్వాన్స్ ఇచ్చినా డేట్స్ దొరకడం చాలా కష్టం అవుతుంది.
ఎన్టీఆర్ తో పాటు ఆ ఇద్దరు స్టార్స్ కు మాత్రమే
అందుకే, టీ సిరీస్ సంస్థ ఆ కారణంగానే ఎన్టీఆర్ తో ముందుగానే సినిమా కమిట్ అయ్యారని బాలీవుడ్ సర్కిళ్లలో వినిపిస్తోంది. ఎప్పటి నుంచో తన లాభాలను టీ సిరీస్ సంస్థ అడ్వాన్స్ లుగా మారుస్తూ వస్తోంది. ఇందులో భాగంగా మరో ఇద్దరు టాప్ హీరోలకు కూడా అడ్వాన్స్ లు ఇచ్చింది. వారిలో ఒకరు షారుఖ్ ఖాన్, మరొకరు అక్షయ్ కుమార్. మొత్తంగా టీ సిరీస్ సంస్థ అంటేనే భారీ రెమ్యూనిరేషన్లు, భారీ అడ్వాన్స్ లు, భారీసినిమాలు. కాకపోతే, ఆ భారీ తనంలోకి ఈ సారి ఎన్టీఆర్ చాలా గ్రాండ్ గా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.
ఇన్నాళ్లూ దేవర పార్ట్ 1 అప్ డేట్స్ తో పండగ చేసుకున్నారు తారక్ ఫ్యాన్స్. మధ్యమధ్యలో వార్ 2 షూటింగ్ మెటీరియల్ తో కూడా పండగ చేసుకున్నారు. ఇప్పుడు మొత్తంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ కోసం మరిన్ని అప్ డేట్స్ టైమ్ దగ్గర పడింది అన్నమాట. అయితే అత్యంత గోప్యంగా, ఈ సినిమాకి సంబంధించి ఎలాంటి లీక్ అవ్వకుండా ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు సాగుతున్నాయి. చివరికి జానర్ ఏంటి, టైటిల్ ఏంటి లాంటి అంశాలు కూడా బయట పడకుండా టీ సిరీస్ సంస్థ అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంది.
ఎన్టీఆర్ కు భారీ అడ్వాన్స్ తో పాటు లుక్ పై చిన్న లీక్
టీ సిరీస్ ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. ఈ సినిమాలో ఎన్టీఆర్ లుక్ పై చిన్న లీక్ బయటకు పొక్కింది. ఈ సినిమాలో ఎన్టీఆర్ ను ఫుల్ ఎనర్జిటిక్ గా, మరింత యంగ్ గా, ఫ్యామిలీ ఆడియన్స్ ఇష్టపడే లుక్ లో చూపించానని తెలుస్తోంది. పైగా ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన అలియా భట్ హీరోయిన్ గా నటిస్తోందట. మరో కీలక పాత్రలో కియారా అద్వానీ, అలాగే, రాశి ఖన్నా మిగతా హీరోయిన్లు. 2025 మొదట్లో ఈ సినిమా మొదలు అయ్యి, 2026 సమ్మర్ లో విడుదలయ్యే అవకాశం ఉంది. అప్పటికి పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు గానీ, సౌత్ సినిమాల పై హిందీ వాళ్ళకు ఏ రేంజ్ లో మోజు ఉంటుందో తెలియదు గానీ. అప్పటికే ఎన్టీఆర్ తన నటనతో వారిని కూడా తన అభిమానులుగా మార్చుకునే ఛాన్స్ ఉంది.
ఎలాగూ హిందీ టీవీ చానళ్లకు మన డబ్బింగ్ సినిమాలు అంటే విపరీతమైన క్రేజ్. ఎన్టీఆర్ అదుర్స్ సినిమాని హిందీ టీవీ ఛానెల్స్ లో అక్కడ జనం బాగా చూశారు. ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ హిట్ సినిమాలు అన్ని హిందీలో డబ్ అయ్యాయి. ఆ సినిమాలు అన్నిటికీ, హిందీలో మిలియన్ల కొద్దీ వ్యూస్ వచ్చాయి. మొత్తంగా నార్తిండియా జనాలకు ఎన్టీఆర్ యాక్షన్ పిక్చర్లు అంటే భలే క్రేజ్ ఉంది. ఎన్టీఆర్ కొడితే గోడలు బద్ధలయిపోవడాలు.. విలన్లు బౌన్స్ అవుతూ నెత్తురుకక్కుకోవడాలను అక్కడి వారికి ఫుల్ కిక్ ను ఇస్తున్నాయి. యాక్షన్ సినిమా అంటే ఇది కదా అనే ఫీలింగ్ ను కలిగిస్తున్నాయి. సహజంగా హిందీ సినిమాల్లోనూ ఈ తరహా ఫైట్లు ఈ మధ్యనే ఎక్కువ అయ్యాయి. అందుకు ప్రధాన కారణం హిందీ ప్రేక్షకుల పై సౌత్ సినిమాల వల్ల పడిన ప్రభావం అది.
ఇలాంటి నేపథ్యంలో ఎన్టీఆర్ తో టీ సీరీస్ డైరెక్ట్ యాక్షన్ ఫిల్మ్ తీస్తే.. ఇక ఆ సినిమా రేంజ్ ఎలా ఉంటుందో.. ఆ సినిమాకి ఏ స్థాయిలో అంచనాలు క్రియేట్ అవుతాయో అర్ధం చేసుకోవచ్చు. అప్పుడు హిందీలోకి డబ్ కాని ఎన్టీఆర్ సినిమా ఉండదు. ఎన్టీఆర్ కు భారీ అడ్వాన్స్ ఇవ్వని హిందీ నిర్మాత ఉండడు. ఏది ఏమైనా తమ అభిమాన హీరో సినిమా హిందీలోకి డబ్బింగ్ అయ్యిందని ఏ స్టార్ హీరో అభిమానులైన చాలా గర్వంగా చెప్పుకుంటారు. అలాంటిది భవిష్యత్తులో ఎన్టీఆర్ హిందీ మార్కెట్ ను షేక్ చేస్తే.. ఇక పరిస్థితి ఎలా ఉంటుందో !!.