ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ గురించి సింపుల్ గా చెప్పాలంటే రేపటి హెల్తీ ఫ్యూచర్ ఇండియాకి పునాది. ప్రజల ఆరోగ్య సేవల యాక్సెసిబిలిటీని పెంచడంతో పాటు సురక్షితమైన పద్ధతిలో యూనివర్సల్ హెల్త్ కవరేజ్ కు ఈ మిషన్ చాలా ఉపయోగపడనుంది. ఈ డిజిటల్ మిషన్ తో మొత్తం దేశానికి సంబంధించి ఒక డిజిటల్ హెల్త్ ఇకోసిస్టమ్ ను క్రియేట్ చేస్తున్నారు. అటు హెల్త్‌కేర్ ప్రొఫెషనల్స్ గురించి, ఇటు రోగుల హెల్త్ హిస్టరీ గురించి పూర్తిగా తెలుసుకోవడానికి ఈ మిషన్ ఓ గొప్ప యాక్సెస్ ను క్రియేట్ చేస్తోంది. అందుకే, ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ రేపటి భారతదేశ ఆరోగ్య సంరక్షణకు భవిష్యత్తుగా నిలవబోతుంది. ఈ డిజిటల్ మిషన్ ద్వారా ప్రజలకు మెరుగైన మరింత ఉపయోగకరమైన ఆరోగ్య సేవను అందించవచ్చు.
ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ ప్రాసెస్ ఏమిటి ?
రెండు పదాల్లో.. వైద్య రికార్డులను స్టోర్ చేయడం, యాక్సెస్ చేయడం. వివరంగా చెప్పుకుంటే.. రోగుల వైద్య రికార్డులను సురక్షితంగా సేవ్ చేస్తోంది. అలాగే, వారికీ మళ్లీ ఆనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు గతంలోని వారి మొత్తం హెల్త్ హిస్టరీని చాలా సులభంగా తిరిగి యాక్సెస్ చేయవచ్చు. అదే విధంగా హెల్త్ కేర్ ప్రొవైడర్ల సాయంతో వారు చికిత్సకి సంబంధించిన వివరాలను మరియు వారి హెల్త్ ఫాలో అప్ ను కూడా ఈ డిజిటల్ మిషన్ తో చాలా ఈజీ కానుంది. అలాగే, ప్రైవేటు మరియు పబ్లిక్ హెల్త్ ఫెసిలిటీలతో పాటు హెల్త్ సర్వీస్ ప్రొవైడర్ల గురించి కూడా ఈ ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ ద్వారా ఖచ్చితమైన సమాచారాన్ని తెలుసుకోవచ్చు. అన్నిటికి కంటే ముఖ్యంగా టెలి-కన్సల్టేషన్ తో పాటు ఇ-ఫార్మసీ ద్వారా కూడా పేషంట్లు రిమోట్ పద్దతిలో హెల్త్ సర్వీసులను పొందవచ్చు.
పేషంట్ లకు ఏ విధంగా ఉపయోగం ?
గతంలో పేషంట్ కి వచ్చిన ఆరోగ్య సమస్యలు ఏమిటో, ఆ సమయంలో ఆ పేషంట్ తాలూకు కంప్లీట్ హెల్త్ హిస్టరీ గురించి తెలిసినప్పుడు.. ప్రస్తుత అనారోగ్య సమస్యల గురించి డాక్టర్స్ కి మరియు హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ కి ఓ అవగాహన వస్తోంది. అప్పుడు రోగి అనారోగ్యం గురించి పూర్తిగా అర్ధం చేసుకునే అవకాశం ఉంది. దాంతో, వారు ఆ పేషంట్ కి మెరుగైన, మరియు సమర్థవంతమైన వైద్యాన్ని అందించగలరు. రోగం పై తెలివైన నిర్ణయం తీసుకోవడానికి ఇది ఎంతో మేలు చేస్తోంది. ఒక్క మాటలో ఈ ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ ద్వారా పేద ప్రజలకు చాలా మేలు జరగనుంది. ప్రతి ఒక్కరికి ఆరోగ్య సేవలు అందే అవకాశం ఉంది.
డిజిటల్ హెల్త్ ఇన్సెంటివ్ స్కీమ్ గురించి ?
మీకు తెలుసా ?, ఈ ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ మొదలు పెట్టినప్పటి నుంచి, డిజిటల్ హెల్త్ రికార్డులు గణనీయంగా పెరుగుతూ వెళ్తున్నాయి. ఇంకా, చాలా మంది ఇప్పటికీ నాన్-డిజిటల్ హెల్త్ కేర్ సేవలను ఉపయోగిస్తున్నా.. భవిష్యత్తులో పూర్తిగా హెల్త్ రికార్డులన్నీ డిజిటలైజ్ అవుతాయి. హెల్త్ రికార్డులను డిజిటలైజ్ చేసే ప్రయత్నంలోనే, డిజిటల్ హెల్త్ ఇన్సెంటివ్ స్కీమ్ పెట్టారు. నేషనల్ హెల్త్ అథారిటీ డిజిటల్ హెల్త్ ఎకోసిస్టమ్‌కు సహకరిస్తున్న హాస్పిటల్స్ కి మరియు డాక్టర్స్ అందరికీ డిజిటల్ హెల్త్ ఇన్సెంటివ్ స్కీమ్ అనే ఓ ప్రోత్సాహక పథకాన్ని కేంద్ర ప్రభుత్వం అందిస్తోంది.
ఇంతకీ, డిజిటల్ హెల్త్ ఇన్సెంటివ్ స్కీమ్ అంటే ఏమిటి ?
ఈ డిజిటల్ హెల్త్ ఇన్సెంటివ్ స్కీమ్ ద్వారా హాస్పిటల్స్ కి లేదా హెల్త్ మేనేజ్‌మెంట్ కి ‘ఇన్ఫర్మేషన్ సిస్టమ్’, మరియు ‘లాబొరేటరీ మేనేజ్‌మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్’ వంటి డిజిటల్ హెల్త్ సాఫ్ట్‌వేర్స్ ను తక్కువ ధరకే అందిస్తున్నాయి. అలాగే, ఈ డిజిటల్ హెల్త్ ఇన్సెంటివ్ స్కీమ్ ద్వారా కొన్ని ప్రోత్సాహాలను ప్రభుత్వం వారికీ అందిస్తోంది.
ఈ మిషన్ తో పేదలకు జరిగే మేలు ఏమిటి ?
ఆరోగ్యశ్రీ, ఆయుష్మాన్ భారత్ వంటి పథకాలను ఎన్ని పెట్టినా… నేటికీ పేద వాడికి వైద్యం పూర్తిగా అందని పరిస్థితి ఉంది. ఇంకా కొన్ని ప్రభుత్వ హాస్పిటల్స్ లో కూడా డేటా సరిగ్గా లేదు. అలాగే, అవగాహన లోపంతో పాటు సిస్టమ్ లోని లూప్ హొల్స్ కారణంగా పేదలకు సరైన వైద్య విధానం లేదు. ఐతే, ఈ మిషన్ ద్వారా రోగుల వైద్య రికార్డులన్నీ డిజిటలైజ్ అవుతాయి కాబట్టి, లోపాలు జరగకుండా చూసుకునే అవకాశం ఉంది.
అలాగే, రోగి ఆరోగ్య డేటాతో పాటు ఆ రోగి ల్యాబ్ ఫైల్స్, డిశ్చార్జ్ వివరాలు, మరియు చికిత్సకి సంబంధించిన పూర్తి వివరాలు అన్నిటిని ఆ రోగి పేరట డేటాను సేవ్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు ప్రభుత్వ హాస్పిటల్స్ లోని డాక్టర్స్, అలాగే కొన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా ఎంతో జాగ్రత్తగా పేదవారికి వైద్యం అందిస్తాయి.